IPL 2025 Final: ఐపీఎల్ 2025 ఫైనల్ (IPL 2025 Final) మ్యాచ్ నేపథ్యంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ కెప్టెన్ రజత్ పటీదార్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఐపీఎల్‌లో రజత్ పటీదార్ ప్రస్థానం ఎలా మొదలైంది?, అతడి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ ఏమిటి? వంటి అంశాలు చక్కర్లు కొడుతున్నాయి. భారత జట్టు తరపున ఇప్పటివరకు కనీసం ఒక్క టీ20 అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని రజత్ పటీదార్‌ను 2025 ఐపీఎల్ సీజన్‌కు నయా కెప్టెన్‌గా ఎంపిక చేస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. అది కూడా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీని కూడా పక్కనపెట్టి మరీ అతడిని ఎంపిక చేసింది. ఆర్సీబీ కెప్టెన్సీ పగ్గాలు తిరిగి చేపట్టేందుకు కోహ్లీ సానుకూలంగా కనిపించినప్పటికీ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినప్పటికీ పటీదార్‌పై పూర్తి విశ్వాసాన్ని ఉంచుతూ ఈ నిర్ణయం తీసుకుంది.
Read this, IPL Final 2025: ఆర్సీబీకి మాజీ ప్రధాని ఫుల్ సపోర్ట్.. కారణాలు ఇవే!
వేలంలో అమ్ముడుపోలేదు..
నిజానికి, టీమిండియా తరపున ఇప్పటివరకు 3 టెస్టులు, ఒక వన్డే మాత్రమే ఆడిన రజత్ పటీదార్‌ను ఐపీఎల్ వేలం-2022లో ఎవరూ కొనుగోలు చేయలేదు. అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోవడంతో ఆ ఏడాది వేసవిలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మే 9న ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ఇండోర్ నగరంలో ఒక హోటల్‌ను కూడా బుక్ చేసుకున్నారు. అయితే, వివాహాన్ని అంత గ్రాండ్‌గా జరపకూడదని నిర్ణయించుకున్నారు. కనీసం శుభలేఖలు కూడా ముద్రించలేదు. అతికొద్ది మంది అతిథులకు మాత్రమే ఆహ్వానాలు పంపారు. అయితే, అంతలోనే అనూహ్యంగా రజత్‌ను ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఆర్సీబీ ఫ్రాంచైజీ ఎంపిక చేసి పిలుపునిచ్చింది. దీంతో, పెళ్లిని వాయిదా వేసుకొని మరీ ఐపీఎల్ 2022 సీజన్‌లో పటీదార్ ఆడాడు. ఆ విధంగా ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఈ యువ క్రికెటర్ ఇప్పటివరకు వెనుతిరిగి చూసుకోలేదు. 2022లో మధ్యప్రదేశ్ తరపున రంజీలో ఆడిన తర్వాత జులై నెలలో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని రజత్ పటీదార్ తండ్రి గతంలో స్వయంగా వెళ్లడించారు.
Read this, RCB Fan: కప్ కోసం ఎంతకు తెగించార్రా.. ఆర్‌సీబీ ఫ్యాన్ పనికి అవాక్కవాల్సిందే!
లక్నోపై అదిరిపోయే ఇన్నింగ్స్
ఐపీఎల్ 2022 ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఆడిన ఇన్నింగ్స్ రజత్ కెరీర్‌ను మార్చివేసింది. ఆ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ చేయడంతో పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో మెరిశాడు. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయినప్పటికీ రజత్ పటీదార్ ఇన్నింగ్స్ అందరినీ ఆకట్టుకుంది. బీసీసీఐ సెలక్టర్ల దృష్టిలో కూడా పడడంతో 2023లో వన్డే ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత టెస్టు జట్టులో కూడా చోటు దక్కించుకొని మొత్తం 3 టెస్టులు మ్యాచ్‌లు ఆడాడు. కానీ, ఆ తర్వాత చోటు కోల్పోయాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆర్‌సీబీ ఫ్రాంచైజీ రజత్‌ను రూ.11 కోట్ల ధర రిటెయిన్ చేసుకుంది. విరాట్ కోహ్లీ, యష్ దయాల్‌తో పాటు నిలుపుకున్న ఆటగాళ్లలో రజత్ ఉన్నాడు. మొత్తంగా 2016 తర్వాత ఆర్సీబీని ఐపీఎల్ ఫైనల్‌కు చేర్చడంలో కెప్టెన్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు, 2024/25 సీజన్‌లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ జట్టుకు కూడా రజత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
Read this, IPL Final Closing Ceremony: ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. ఈసారి ముగింపు వేడుకలు ధూమ్ ధామే!