Viral Video: సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం యూత్ పడుతున్న పాట్లు అన్ని ఇన్నీ కావు. రాత్రికి రాత్రి హీరో అయిపోవాలన్న అత్యాశతో అనాలోచితంగా స్టంట్స్ చేస్తున్నారు. ముందు వెనక ఆలోచించకుండా కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా గుజరాజ్ లోని ఓ బీచ్ లో యువకుడు ప్రదర్శించిన అత్యుత్సాహం.. అతడ్ని చిక్కుల్లో పడేలా చేసింది. ఖరీదైన మెర్సిడీస్ బెంజ్ కారు (Mercedes Benz Car)తో తీరం వెంబడి స్టంట్ చేయడానికి ప్రయత్నించి.. ఊహించని సమస్యను కొని తెచ్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.
అసలేం జరిగిందంటే?
గుజరాత్ (Gujarat) సూరత్ లోని డుమాస్ బీచ్ (Dumas Beach) లో ఓ యువకుడు తన మెర్సిడెస్ బెంజ్ కారుతో స్టంట్ చేసేందుకు యత్నించాడు. దీంతో కారు సముద్రపు బురదలో కూరుకుపోయింది. భారీ వర్షాలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉన్న సమయంలో అతడు ఈ స్టంట్ కు యత్నించడం గమనార్హం. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో బీచ్ లో వాహనాల రాకపోకలను అధికారులు నిషేధించారు. అయినప్పటికీ వారి కళ్లుకప్పి సదరు యువకుడు కారుతో బీచ్ లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు కారును బయటకు తీసేందుకు కష్టపడుతున్న వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది.
#Trending | A luxury car stunt turned into an embarrassing ordeal over the weekend when a Mercedes Benz got stuck in swampy sand at Dumas beach in #Gujarat’s #Surat.
In a video of the moment that went viral on social media, the car’s occupants are seen standing helplessly,… pic.twitter.com/lWwelXa9Ta
— IndiaToday (@IndiaToday) July 21, 2025
Also Read: Artificial Sweeteners: చక్కెరకు బదులుగా వీటిని వాడుతున్నారా? అయితే మీ గుండె మటాషే!
నెటిజన్లు సెటైర్లు!
వర్షం కారణంగా బీచ్ లోని ఇసుక మరింత మెత్తగా మారడంతో కారు సముద్ర ఒడ్డున ఇసుకలో చిక్కుకుపోయిందని అధికారులు తెలియజేశారు. వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా కారు యజమని ఎవరు? ఆ ఘటన ఎప్పుడు జరిగింది? అన్నది ఆరా తీస్తున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ ఎస్.ఆర్. టండేల్ తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే అతడు తన కారును బురద నుంచి బయటకు తెచ్చుకోగలిగాడో లేదో ఇంకా తెలియరాలేదు. కాగా ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక జన్మలో ఇలాంటి స్టంట్ మళ్లీ చేయడని సదరు యువకుడిపై సెటైర్లు వేస్తున్నారు.