Viral Video (Image Source: Insta Video)
Viral

Viral Video: ప్రభుదేవా సాంగ్‌ను.. చించి ఆరేసిన ఓల్డేజ్ కపుల్.. వీడియో వైరల్

Viral Video: దేశంలో నెం.1 డ్యాన్సర్ అనగానే ముందుగా ప్రభుదేవా (Prabhu Deva) మాస్టరే గుర్తుకు వస్తారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న మెజారిటీ కొరియోగ్రాఫర్లకు ఆయనే గాడ్. ప్రభుదేవా చేసిన చాలా సాంగ్స్.. ఇప్పటికీ డ్యాన్స్ లవర్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పాట.. ‘ప్రేమికుడు’ సినిమాలోని ‘ముక్కాల ముక్కాబుల సాంగ్’ (Mukkala Mukkabala). ఇందులో ఆయన వేసిన స్టెప్పులు చాలా మెస్మరైజింగ్ గా ఉంటాయి. అటువంటి ఈ పాటకు ఓ జంట తమదైన శైలిలో డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వీడియోలో ఏముందంటే?
లోకిత్ కుమార్ (Lokith Kumar) అనే వ్యక్తి ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. వీడియోను గమనిస్తే.. ఓ వేడుకలో పాల్గొన్న జంట.. ముక్కాల ముక్కాబుల సాంగ్ కు అదిరిపోయే విధంగా స్టెప్పులు వేసింది. తమ అద్భుతమైన కెమెస్ట్రీతో అక్కడి వారిని ఆకట్టుకుంది. దీంతో ఈ వీడియోను షేర్ చేసిన కొద్దిసేపటికే అది లక్షల్లో వ్యూస్, వేలల్లో కామెంట్స్ ను సాధించింది. వీడియోలో గులాబీ రంగు చీర కట్టిన మహిళ.. సంప్రదాయ తెల్ల పంచెకట్టు, చొక్కా ధరించిన వ్యక్తితో కలిసి ఎంతో ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంతో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అక్కడున్న వారు చప్పట్లతో వారిని ప్రోత్సహించారు. ‘మరచిపోలేని క్షణాలను సృష్టిస్తున్నాం. ఇలాంటి అద్భుతమైన జంటను కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని లోకిత్ కుమార్ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.

Also Read: Sahasra Murder Case: క్రికెట్ బ్యాట్ కోసమే దొంగతనం.. సహస్ర అరవడంతో హత్య.. సైబరాబాద్ సీపీ

నెటిజన్లు ప్రశంసల
ముక్కాల పాటకు డ్యాన్స్ చేసిన జంటపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ప్రపంచంలోనే అందమైన జంట’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఈ జీవితంలో ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని ఈ జంట చెబుతోంది’ అని మరొకరు రాసుకొచ్చారు. ‘ప్రపంచం ఏమనుకున్నా అతనే మీ హీరో. మీరే అతడి హీరోయిన్. జీవితంలో సంతోషంగా ఉండాలి. ఎవర్నీ పట్టించుకోకండి. మీ జీవితాన్ని ఎంజాయ్ చేయండి’ అని ఇంకొకరు రాసుకొచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by Lokith Kumar (@dj_lokee)

Also Read: Jaishankar on Trump: డొనాల్డ్ ట్రంప్‌పై విదేశాంగ మంత్రి జైశంకర్ డేరింగ్ కామెంట్స్

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!