Viral Video: ఇంటర్నెట్‌లో ఓ వీడియో మామూలుగా వైరల్ అవ్వడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వీడియో దుమ్మురేపుతుందని చెప్పుకోవాలి. ఒక పిల్లి తన అంధ కుక్క స్నేహితుడిని ఆప్యాయంగా ఓదార్చిన సీన్ గుండెల్ని హత్తుకుంటుంది. ఆ చిన్న క్లిప్‌లో ఉన్న మమకారం, ప్రేమ, జంతువుల మధ్య ఉన్న ఆ బంధం చూసి ఎవరి హృదయం కరిగిపోతుందో చెప్పలేం.
వీడియోలో కుక్క కొంచెం భయంగా, కన్ఫ్యూజ్ అయి నిలబడి ఉంటుంది. అప్పుడు పక్కనే ఉన్న పిల్లి తన చిన్న పంజాను కుక్క ముఖంపై చూస్తూ.. “ఏం లేదు రా, నేను నీతోనే ఉన్నాను” అని చెప్పినట్టుగా ఒక చూపు చూస్తుంది. ఆ ఒక్క టచ్‌లో ఉన్న ఆప్యాయత, దయ నిజంగా హృదయాన్ని హత్తుకుంటుంది.
ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (పాత ట్విట్టర్), రెడ్డిట్ వంటి సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్‌ల్లో ఈ వీడియో బాగా వైరల్ అయిపోయింది. నెట్‌జన్లు దీనిని “ఇటీవలి కాలంలో చూసిన మధురమైన స్నేహ క్షణం” అని చెబుతున్నారు. కామెంట్ బాక్స్ లో ప్రేమతో నిండిన మెసేజ్‌లు వెల్లువెత్తుతున్నాయి.
“నా హృదయం ఇలాంటి సంతోషాన్ని తట్టుకోలేకపోతోంది!” అని ఒకరు రాశారు. “ ఈ పిల్లి ప్రేమను మనుషుల కంటే బాగా అర్థం చేసుకుంది. ” అని ఇంకొకరు కామెంట్ చేశారు. కొంతమంది తమ పెంపుడు జంతువుల గురించిన ఇలాంటి మధురమైన అనుభవాలను పంచుకున్నారు. “మా పిల్లి, మా కుక్క మధ్య కూడా ఇలాంటిదే బంధం ఉంది.” అంటూ మరొకరు రాశారు. “ఇలాంటివి మనుషుల మధ్య కూడా ఉంటే ప్రపంచం ఎంత అందంగా ఉండేది.”
