Alleti Maheshwar Reddy: జీవితాంతం కాంగ్రెస్ కు సేవ చేసిన షబ్బీర్ అలీని కాదని దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం వెనుకున్న ఆంతర్యమేంటని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో మైనారిటీలు గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో అజారుద్దీన్ పై క్రికెట్ లో లైఫ్ టైమ్ బ్యాన్ ఉందని, అలాంటి దేశ ద్రోహానికి పాల్పడిన వ్యక్తికి గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ ఇస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
Also Read: Alleti Maheshwar Reddy: కవిత ఎదగడం కేటీఆర్‌కు ఇష్టం లేదా?
ఎకరానికి రూ.30 వేల నష్టపరిహారం ప్రకటించాలి
అజారుద్దీన్ కు మంత్రి పదవి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్టంట్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రోమ్ నగరం తగలబడుతుంటే రాజు ఫిడేల్ వాయించినట్టు రేవంత్ రెడ్డి తీరు ఉందని విమర్శలు చేశారు. మొంథా తుఫాన్ రాష్ట్రాన్ని ముoచితే.. సీఎం పెళ్ళిళ్ళు, పేరంటాలు, సల్మాన్ ఖాన్ అంటూ తిరుగుతున్నారని ఏలేటి ఎద్దేవాచేశారు.చంద్రబాబును చూసి రేవంత్ నేర్చుకోవాలని సూచించారు. రైతుల గోసను పట్టించుకోవాలన్న ధ్యాస రేవంత్ కు లేకుండాపోయిందన్నారు. రెండేళ్ల పాలనలో ఎంతమంది రైతులను ఆదుకున్నారో ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తక్షణమే వరి పంటకు ఎకరానికి రూ.30 వేల నష్టపరిహారం ప్రకటించాలన్నారు. లేదంటే రైతు ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ఏలేటి హెచ్చరించారు.
కంట్రోల్ చేసేది ముఖ్యమంత్రా? లేక అసదుద్దీన్ ఓవైసీ నా?
రేవంత్ కు కుర్చీ కాపాడుకునేందుకే సరిపోతోందని చురకలంటించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేది ముఖ్యమంత్రా? లేక అసదుద్దీన్ ఓవైసీ నా? అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పైన షర్ట్, ప్యాంట్ తో ఉంటూ లోపల మాత్రం షేర్వాణి వేసుకుని తిరుగున్నారని ఏలేటి ఎద్దేవాచేశారు. ఓవైసీ, రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలకు తెరలేపారని, జూబ్లీహిల్స్ ప్రజలు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ను గమనిస్తున్నారని ఎద్దేవాచేశారు. నవీన్ యాదవ్ అసదుద్దీన్ కు పెంపుడు వ్యక్తి అని, అందులో భాగంగానే నవీన్ కు ఓవైసీ టికెట్ ఇప్పించుకున్నారన్నారు. ఓవైసీ తన బావమరిది అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇప్పించుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ స్టీరింగ్ దారుస్సలాంలో ఉందన్నారు. ఒకవర్గం మెప్పు కోసం సీఎం సల్మాన్ ఖాన్ తో ఫొటోలు దిగితే జూబ్లీహిల్స్ లో ఓట్లు పడతాయా అని ఏలేటి ప్రశ్నించారు.
Also Read: Alleti Maheshwar Reddy: ‘సివిల్ సప్లై శాఖపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం’
