Viral News (Image Source: Twitter)
Viral, లేటెస్ట్ న్యూస్

Viral News: మహిళ జాకెట్‌లో రెండు తాబేళ్లు.. అవాక్కైన అధికారులు.. పెద్ద ప్లానే ఇది!

Viral News: ఎయిర్ పోర్ట్ లో నిషేధిత వస్తువులను తరలిస్తూ పలువురు పట్టుబడుతున్న ఘటనలను నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. బంగారం, మాదక ద్రవ్యాలు, విదేశీ వస్తువులను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తూ ఎయిర్ పోర్ట్ సిబ్బందికి చిక్కుతున్నారు. అయితే అమెరికాలో ఈ కోవకు సంబంధించే విచిత్ర ఘటన చోటుచేసుకుంది. విమానం దిగి ఎయిర్ పోర్ట్ కు వచ్చిన మహిళను తనిఖీలు చేయగా.. ఆమె జాకెట్ (లోదుస్తులు) రెండు తాబేళ్లు ఉండటాన్ని చూసి అధికారులు అవాక్కయ్యారు.

వివరాల్లోకి వెళ్తే..
అమెరికా ఫ్లోరిడాలోని మయామి అంతర్జాతీయ విమానశ్రయం (Miami International Airport)లో ఒక మహిళ తన బ్రాలో రెండు తాబేళ్లను దాచి భద్రతా సిబ్బంది కళ్లుగప్పి జారుకునేందుకు ప్రయత్నించింది. అయితే ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (Transportation Security Administration – TSA) అధికారులు ఆమెను పట్టుకున్నారు. అయితే ఆ మహిళ ఎవరు, ఆమె వ్యక్తిగత వివరాలను అధికారులు పంచుకోలేదు. TSA అధికారుల వివరణ ప్రకారం.. తాబేళ్లను ప్లాస్టిక్ ర్యాప్‌లో చుట్టి సదరు మహిళ.. లోదుస్తుల్లో దాచారు. అలా చేయడం వల్ల దురదృష్టవశాత్తూ ఒక తాబేలు చనిపోయింది. మరొకటి ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్‌కు అధికారులు అప్పగించారు.

అధికారుల ఏం చెబుతున్నారంటే?
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వేదికగా తెలియజేస్తూ టీఎస్ఏ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘స్నేహితులారా ఈ విషయాన్ని మరింత నొక్కి చెప్పలేకపోతున్నాం. మీ శరీరంలోని వింత ప్రదేశాలలో జంతువులను దాచిపెట్టి విమానశ్రయ భద్రత గుండా దొంగిలించడానికి ప్రయత్నించడం ఆపండి’ అంటూ టీఎస్ఏ తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొంది. ‘మీరు మీ పెంపుడు జంతువులతో చట్టబద్దంగా ప్రయాణించాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి వాటితో సురక్షితంగా ప్రయాణించండి’ అంటూ చెప్పుకొచ్చింది. పెంపుడు జంతువులను క్యారియర్ లా కాకుండా చేతితో పట్టుకొని తీసుకొని రావాలని విమాన ప్రయాణికులకు స్పష్టం టీఎస్ఏ స్పష్టం చేసింది.

Also Read: RMP Clinics: ఆర్ఎంపీల ఇష్టారాజ్యం.. నిబంధనలకు విరుద్ధం

ఇదేం కొత్త కాదు
జంతువులను రహస్యంగా తరలించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఈ తరహా ఘటనలు అమెరికాలోని పలు విమానాశ్రయాల్లో చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మార్చిలో నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక వ్యక్తి తన ప్యాంటులో తాబేలును దాచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. గతేడాది ఒక వ్యక్తి పాముల సంచిని విమానంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అధికారులు గుర్తించి అతడ్ని అడ్డుకున్నారు. 2023లో మయామి విమానాశ్రయంలో అమెజాన్ చిలుక గుడ్లు, అరుదైన పక్షులతో కూడిన సంచిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read This: Kingdom Pre Release: ‘కింగ్డమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. నిర్మాత పోస్ట్ వైరల్

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?