kingdom pre release event( image source :x)
ఎంటర్‌టైన్మెంట్

Kingdom Pre Release: ‘కింగ్డమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. నిర్మాత పోస్ట్ వైరల్

Kingdom Pre Release: విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కింగ్డమ్’ (Kingdom)సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. జూలై 31 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇటీవల జరిగిన టీజర్ రిలీజ్ ఈవెంట్ కు కూడా ఏ రేంజ్‌లో హైప్ వచ్చిందో తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సంబంధించిన పోస్టర్ ను నిర్మాత నాగవంశీ విడుదల చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూసఫ్ గూడలో ఉన్న పోలీస్ గ్రౌండ్ లో నిర్వహించనున్నట్లుగా పోస్టర్ విడుదల చేశారు.

Read also- Somy Ali: ఆదిత్య పంచోలీ, సూరజ్ పంచోలీపై సంచలన ఆరోపణలు చేసిన నటి సోమీ అలీ

‘మృత్యువు జడిసేలా పద పద, శత్రువు బెదిరేలా పద పద, గర్జన తెలిసేలా పద పద, దెబ్బకు గెలిచేలా పద పద’ అంటూ నిర్మాత తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది. అంతే కాకుండా ఈ సినిమాలో రెండు పాత్రలకు సంబంధించిన పోస్టర్లను కూడా విడుదల చేశారు. అందులో సత్యదేవ్ శివగా కనిపించనున్నారు. వెంకటేష్ మురుగన్ గా కనిపించనున్నారు. శివగా కనిపించిన సత్యదేవ్ పాత్ర మోస్ట్ వైలెంట్ లుక్ లో కనిపించనుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ‘ఎంకన్న సామి అనుగ్రహిస్తే లాప్ లో పోయి కూసుంటా’ అన్న విజయ్ దేవరకొండ మాటలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read also- Fertilizer shortage: తెలంగాణలో ఎరువల కొరత.. అసలు కారకులు ఎవరు?

రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా నటిస్తున్న ‘కింగ్డమ్‌’ జులై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న స్పై యాక్షన్‌ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌లో పాన్ ఇండియా లెవెల్‌లో రాబోతున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. కథానాయికగా భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రచారంలో భాగంగా విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా, గౌతమ్‌ తిన్ననూరి కలిసి ముచ్చటించిన వీడియో ఎంత వైరల్ అయిందో తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?