liver health
Viral, లేటెస్ట్ న్యూస్

Liver Care: లివర్ ఆరోగ్యాన్ని కాపాడే తేలికైన సలహాలు ఇవే!

Liver Care: మనిషి శరీరంలో ‘బయోలాజికల్ ఫ్యాక్టరీ’గా అభివర్ణించే కాలేయం (Liver) చాలా ముఖ్యమైనది. కీలకమైన అవయవాల్లో ఇదొకటి. ప్రతినిత్యం శరీరంలో ముఖ్యమైన పనులను చక్కబెడుతుంది. శరీరంలో విషపదార్థాలను వడకట్టడం, జీర్ణక్రియలో సాయం, శరీరాన్ని సమతుల్యంగా ఉంచడంతో పాటు ఇతర పలు చర్యల్లో ఎంతో దోహపడుతుంది. అందుకే, లివర్ ఆరోగ్యం (Liver Care) కోసం కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకు సంబంధించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ జోసెఫ్ సల్హబ్ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేశారు. కాలేయ ఆరోగ్యానికి ఉపయోగపడే కొన్ని సులభమైన, ముఖ్యమైన పానీయాల గురించి చెప్పారు. కాలేయానికి హానికరమైన డ్రింక్స్ తీసుకోవద్దని, దానికి బదులుగా ఆరోగ్యానికి మేలు చేసే పానీయాలు తాగాలని డాక్టర్ సల్హబ్ సూచించారు. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పానీయాలను వెల్లడించారు. వాటిపై మీరు కూడా ఒక లుక్ వేయండి.

1. బీట్‌రూట్ జ్యూస్ (Beetroot Juice)
బీట్‌రూట్‌లో బీటలైన్ యాంటీఆక్సిడెంట్లు, నైట్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే, బీట్‌రూట్ జ్యూస్ తాగితే శరీరంలోని నైట్రిక్ ఆక్సైడ్ స్థాయి పెరుగుతుంది. ఇది కాలేయ రక్తప్రసరణను మెరుగుపరచడంలో ఎంతగానో దోహదపడుతుంది.

2. దానిమ్మ రసం (Pomegranate Juice)
దానిమ్మలో ప్యునికలాగిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయ కొవ్వు ప్రాసెసింగ్‌కు తోడ్పడతాయి. రక్తప్రసరణ చక్కగా ఉంచడంలోనూ తోడ్పడతాయని డాక్టర్ జోసెఫ్ వివరించారు.

3. మాచా (Matcha)
ప్రత్యేకమైన టీ ఆకుల నుంచి సేకరించిన పొడితో తయారు చేసిన పానీయంలో ఈజీసీజీ అనే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కాలేయంలోని కొవ్వును చక్కగా మేటబలైజ్ చేస్తాయి. అంతేకాదు, కాలేయ రక్తప్రసరణ మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడతాయని డాక్టర్ జోసెఫ్ వెల్లడించారు.

4. గ్రీన్ టీ (Green Tea)
కటెకిన్ యాంటీఆక్సిడెంట్లతో నిండిపోయిన గ్రీన్ టీ కాలేయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొవ్వును నియంత్రించడంలో, ఆరోగ్యకరమైన రక్తప్రసరణ కొనసాగించడంలో ఉపయోగపడుతుంది.

Read Also- Sunjay Family: సుంజయ్ కపూర్ ఫ్యామిలీలో ‘రూ.30 వేల కోట్ల’ చిచ్చు

5. బ్లాక్ కాఫీ (Black Coffee)
బ్లాక్ కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. కాలేయంలోని కొవ్వు స్థాయిలను తగ్గించడంలో, సూక్ష్మ రక్తప్రసరణను మెరుగుపరచడంలోనూ తోడ్పడతాయి.

6. బ్లాక్ టీ (Black Tea):
బ్లాక్‌ టీలో థీఫ్లావిన్ యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాలేయం కొవ్వు నిర్వహణలో, రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని డాక్టర్ జోసెఫ్ వివరించారు.

7. హాట్ కోకో (Hot Cacao)
ఈ హాట్ డ్రింక్‌లో ఉండే కోకోవా ఫ్లావనాల్స్.. కాలేయంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిని పెంచడంతో పాటు కాలేయ రక్తప్రసరణకు ఉపయోగపడతాయి.

Read Also- PM Modi: ప్రధాని మోదీపై తాజా ప్రజాభిప్రాయం ఇదే

8. పసుపు-అల్లం టీ (Turmeric-Ginger Tea)
పసుపులో ఉండే కర్క్యూమిన్ (Curcumin), అల్లంలో ఉండే జింజెరాల్ (Gingerol) అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో తయారు చేసిన ఈ టీ పిత్తస్రావాన్ని ఉత్తేజితం చేస్తుంది. కొవ్వుకు దూరంగా ఉంచడంతో ఉపయోగపడతాయి.

9. బెర్రీ స్మూతీలు (Berry Smoothies)
యాంటోసయనిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో కూడిన బెర్రీ స్మూతీలు కాలేయ కొవ్వు మెటబాలిజాన్ని మెరుగుపరచడంతో ఉపయోగపడతాయి. సూక్ష్మ రక్తప్రసరణను పటిష్టం చేస్తాయని డాక్టర్ జోసెఫ్ వివరించారు.

గమనిక:సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిథిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు