Narendra Modi
జాతీయం, లేటెస్ట్ న్యూస్

PM Modi: ప్రధాని మోదీపై తాజా ప్రజాభిప్రాయం ఇదే

PM Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వదేశంతో పాటు విదేశాల్లోనూ విశేష ఆదరణ ఉంది. తాజాగా వెలువడిన ఓ సర్వేలో ఈ విషయం మరోసారి రుజువైంది. ‘డెమోక్రాటిక్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్’ అంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య నాయకులలో అత్యధిక ప్రజాధరణ కలిగిన నేతగా ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. అత్యధికంగా ఆయనకు 75 శాతం అప్రూవల్ స్కోర్ లభించింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి కనీసం టాప్-5లో కూడా చోటు దక్కించుకోలేకపోయారు. ఆయన 8వ స్థానంలో నిలిచారు. ఆయనకు ప్రజాదరణ రేటింగ్ 45 శాతం కంటే తక్కువగా ఉంది. ఈ ర్యాంకులను అమెరికాకు చెందిన బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ విడుదల చేసింది. మోదీ తర్వాతి స్థానంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జంగ్‌-జే నిలిచారు. ఆయనకు 59 శాతం ప్రజాదరణ లభించింది.

Read Also- Sunjay Kapur: బిజినెస్‌మాన్ మృతి.. అత్తను గదిలో బంధించిన కోడలు!

ఈ గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్‌ను జులై 4 నుంచి 10 తేదీల మధ్య నిర్వహించారు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ వివిధ దేశాల్లోని పెద్దవయస్కుల నుంచి సగటున ఏడు రోజులపాటు అభిప్రాయాలను సేకరించి ఈ నివేదికను రూపొందించింది. మార్నింగ్ కన్సల్ట్ అమెరికాకు చెందిన డేటా విశ్లేషణ సంస్థ. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాల్లో నాయకులపై ప్రజాభిప్రాయాలను సేకరిస్తుంటుంది. ప్రతిరోజూ వేలాది మందిని ఇంటర్వ్యూ చేస్తూ సమాచారాన్ని సేకరిస్తుంది.

నలుగురిలో ముగ్గురు మోదీపై సానుకూలం
ఈ సర్వేలో పాల్గొన్నవారిలో ప్రతి నలుగురిలో ముగ్గురు ప్రధాని మోదీ పట్ల సానుకూల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 18 శాతం మంది మోదీ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. 7 శాతం మంది ఏమీ చెప్పలేమని అన్నారు. నరేంద్ర మోదీ 2024 మే నెలలో మూడోసారి భారత ప్రధానమంత్రిగా తిరిగి ఎన్నికైన విషయం తెలిసిందే.

Read Also- Viral News: తాగకుండానే బస్ డ్రైవర్‌కు ఆల్కాహాల్ పాజిటివ్.. ఎంక్వైరీ చేస్తే!

టాప్-5 ఎవరెవంటే?

ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జేకి 59 శాతం మంది ఆయన నాయకత్వానికి మద్దతు తెలిపగా, 29 శాతం మంది వ్యతిరేకించారు. 13 శాతం మందికి స్పష్టమైన అభిప్రాయం చెప్పలేకపోయారు. ఆయన అధికారంలోకి వచ్చి కేవలం ఒక నెల మాత్రమే అవుతోంది. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే మూడవ స్థానంలో నిలిచారు. ఆయనకు 57 శాతం మంది మద్దతు తెలపగా, 37 శాతం మంది వ్యతిరేకించారు. కెనడా అధ్యక్షుడు మార్క్ కార్నీకి 56 మంది సానుకూలంగా, 31 మంది వ్యతిరేకంగా ఉన్నారు. ఇక, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌కు 54 శాతం మంది సానుకూలంగా ఉన్నారు. ఇక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. గతేడాది విజయం సాధించి ఆయన రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. సర్వేలో కేవలం 44 శాతం మంది మాత్రమే ఆయనకు మద్దతు తెలిపారు. వాణిజ్య సుంకాలు, అమెరికా అంతర్గత విధానాలకు సంబంధించి ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజాదరణను తగ్గించాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Read Also- Hyd Collector: యూపీ బాలుడి అభ్యర్థనకు కలెక్టర్ హరిచందన రెస్పాన్స్

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?