Viral Video
Viral, లేటెస్ట్ న్యూస్

Viral Video: ఈ వీడియో చూస్తే దాబాకు వెళ్లాలంటే జంకుతారేమో!

Viral Video: ప్రభుత్వ సంస్థల పర్యవేక్షణ కరువైన దాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యత, భద్రత ప్రమాణాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్యకాలంలో కల్తీ ఆహారం, క్రిమికీటకాలకు మేతగా మారిన ఆహార పదార్థాల ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. ఈ తరహా ఆహార పదార్థాలు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయి. సరైన పర్యవేక్షణ, కఠిన చర్యలు లేకపోవడంతో ఆహార నాణ్యతలోని లోపాలు తరచూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. అలాంటి షాకింగ్ ఘటనే మరొకటి వెలుగు చూసింది.

జాతీయ రహదారుల వెంబడి పెద్ద సంఖ్యలో ఉండే దాబాల్లో పాటించే ఆహార శుభ్రత ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తే షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని జీటీ రోడ్ హైవే మార్గంలో ఉన్న బజ్‌పాయ్ దాబాలో.. తందూరీ రోటీలో ఒక బల్లి కనిపించింది. రోటి పొరల మధ్య దాని తల బయటకు కనిపించింది. మిగతా శరీర భాగమంతా రోటి పొరల్లో కప్పుకుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.

Read Also- SC on Aadhar card: పౌరసత్వానికి ‘ఆధార్‌ ప్రూఫ్ కాదు’.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఆ వీడియోలో, ఇద్దరు కస్టమర్లు దాబా సిబ్బందితో గొడవకు దిగడం కనిపించింది. తందూరీ రోటీలో ఒక పూర్తి చిన్నబల్లి చనిపోయి కనిపించిందంటూ కస్టమర్లు ఘర్షణ పెట్టుకున్నారు. కస్టమర్లలోని ఒకరు రొటీల పొరల మధ్య ఉన్న బల్లిని చూపించారు. ఒక రోటీని చూపిస్తూ, దానిలో తల బయటకు కనిపిస్తున్న బల్లిని స్పష్టంగా చూపించారు. బల్లి పిల్ల మొత్తం రోటిలో ఉందని, తినే ఆహారంలో బల్లి కనిపించడం అంత తేలికైన విషయం కాదని, చాలా పెద్ద విషయమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ రోటీ తిన్న తర్వాత వాంతులు వచ్చాయని కూడా సదరు కస్టమర్ వాపోయాడు.

డాబాను తనికీ చేసిన అధికారులు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న కాన్పూర్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అధికారులు దాబాకు వెళ్లి తనిఖీలు చేపట్టారు. దాబా చాలా అపరిశుభ్రంగా ఉన్నట్టు గుర్తించామని ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్ సింగ్ తెలిపారు. ఇద్దరు అధికారులు దాబాని పరిశీలించారని వివరించారు. తందూరీ పనీర్, కూరగాయల శాంపిళ్లను పరీక్ష కోసం సేకరించామని, ఆ తర్వాత దాబాను సీజ్ చేశామని వివరించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు స్పందిస్తూ, ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. ఫిర్యాదు అందితే మాత్రమే చర్యలు తీసుకోగలమని వివరించారు. ఆహారం కల్తీకి సంబంధించిన వీడియోను చూశామని, అయినప్పటికీ ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని చెప్పారు. ఈ దాబాను సోనూ బజ్‌పాయ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్టు తెలిసిందన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటనా జారీ చేయకపోవడంతో ప్రభావిత కస్టమర్ల వివరాలు, ఈ ఘటన జరిగిన తేదీ వివరాలు ఇంకా తెలియరాలేదు.

Read Also- Asia Cup squad: ఆసియా కప్‌కు ఎవరూ ఊహించని ప్లేయర్ దూరం!

కాగా, ఈ ఘటన నేపథ్యంలో రోడ్డు వెంబడి నిర్వహించే దాబాల్లో ఆహార భద్రతపై మరోసారి తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ ఏజెన్సీలు తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఆందోళనకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తినే ఆహారం నిజంగా భద్రమా? కాదా? అనే అనుమానాలు, భయాలు జనాల్లో ఎక్కువైపోతాయి.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!