Asia Cup squad: ఆసియా కప్ 2025కు ఎంపిక చేయనున్న భారత జట్టుపై (Asia Cup squad) చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ సారి టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నమెంట్‌కు పలువురు స్టార్ ఆటగాళ్లకు చోటు దక్కే అవకాశం లేదంటూ రెండు మూడు రోజులుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ జాబితాలో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్‌ల పేర్లు జోరుగా వినిపడుతున్నాయి. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ వీరిని పక్కన పెట్టనుందని కథనాలు పేర్కొంటున్నాయి. ఈ జాబితాలో తాజాగా మరో స్టార్ ప్లేయర్ పేరు చేరింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన రిషబ్ పంత్‌కు కూడా ఆసియా కప్ జట్టులో చోటు దక్కకపోవచ్చని తెలుస్తోంది.
ఆసియా కప్ కోసం సెలక్షన్ కమిటీ పరిశీలిస్తున్న ఆటగాళ్ల జాబితాలో రిషబ్ పంత్ పేరులేదని, అతడిని పరిగణనలోకి తీసుకోలేదని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం పేర్కొంది. ఆసియా కప్ ఎంపికలో రిషబ్ పంత్‌కు ఈసారి నిరాశ తప్పదని చెప్పింది. పంత్‌ను పక్కనపెడితే, వికెట్ కీపర్-బ్యాటర్ ఎంపిక విషయంలో, సంజూ శాంసన్‌ను తొలి ప్రాధాన్యం అయ్యే అవకాశం ఉంది. బ్యాకప్ వికెట్ కీపర్ స్థానం కోసం ధృవ్ జురెల్, జితేశ్ శర్మల మధ్య పోటీ నెలకొంటుంది. అయితే, జితేశ్ శర్ వైపు సెలక్టర్లు మొగ్గుచూపే ఛాన్స్ ఉందని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పేర్కొంది.
Read Also- Justice Yashwant Varma: జస్టిస్ వర్మ అభిశంసనపై లోక్‌సభ కీలక నిర్ణయం
నిజానికి, రిషబ్ పంత్ ఇటీవల టీ20 ఫార్మాట్‌లో ఫార్మాట్‌లో పెద్దగా రాణించలేదు. అతడు ఆడిన చివరి 5 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 70 పరుగులు మాత్రమే చేశారు. సగటు కేవలం 17.50గా, స్ట్రైక్ రేట్ 127.26గా ఉన్నాయి. ఈ ఐదు మ్యాచ్‌లూ గతేడాది జరిగినవే కావడం గమనార్హం. ఇండియా తరపునే కాదు, ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో కూడా పంత్ తన స్థాయికి తగిన ప్రదర్శన చేయలేదు. అందుకే, ఆసియా కప్ 2025 టీమ్ నుంచి పంత్‌ను పక్కనపెట్టే దిశగా సెలెక్షన్ కమిటీ యోచిస్తున్నట్టుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి.
Read Also- Indian Railways: ఛీ ఛీ మీరు మనుషులేనా.. యువతికి సాయం చేయకపోగా నవ్వుతారా?
కాగా, రిషబ్ పంత్‌ను గతేడాది ఐపీఎల్ మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఐపీఎల్‌లో రికార్డు ధర పలికిన పంత్‌కు, నిజంగానే ఆసియా కప్‌లో చోటు దక్కకపోతే ఆశ్చర్యం కలగకమానదు. ఇక, పంత్‌తో పాటు, యశస్వి జైస్వాల్‌కు కూడా జట్టులో చోటు దక్కే అవకాశం తక్కువగానే ఉన్నట్టు కనిపిస్తోంది. అదేవిధంగా, 2022 నవంబర్ తర్వాత టీ20 ఫార్మాట్‌లో ఒక్క మ్యాచ్ కూడా భారత్ తరఫున ఆడని కేఎల్ రాహుల్‌ను కూడా ఆసియా కప్‌కు సెలక్టర్లు పక్కనపెట్టనున్నారని సమాచారం.
యువకులపై విశ్వాసం…
ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో విజయాలు నమోదు చేసిన యువ భారత జట్టుపై సెలక్షన్ కమిటీ నమ్మకం పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లతో కూడిన ఈ టీమ్, ఆ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను 4-1 తేడాతో మట్టికరిపించింది. మరోవైపు, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఆ జట్టుకు పెద్దగా మార్పులు చేయకుండానే ఆసియా కప్ బరిలోకి దిగాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ఆసియా కప్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి, వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం జట్టును రూపొందించడంపై గంభీర్ దృష్టి పెట్టబోతున్నాడు.