Viral News: బీహార్‌లోని గయాలో షాకింగ్ ఘటన (Viral News) వెలుగుచూసింది. హోమ్ గార్డ్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఫిజికల్ టెస్టులో పాల్గొన్న 26 ఏళ్ల ఓ యువతికి ఊహించని ఘోరం ఎదురైంది. ఫిజికల్ టెస్టులో పాల్గొన్న యువతి స్పృహ తప్పిపడిపోయింది. అయితే, ఆమెను హాస్పిటల్‌కు తరలించే సమయంలో అంబులెన్స్‌లో సామూహిక అఘాయిత్యం జరిగినట్టుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గయా జిల్లాలోని బోధ్‌గయాలో ఈ దారుణం జరిగింది. జులై 24న బోధ్‌గయాలోని బీహార్ మిలిటరీ పోలీస్ గ్రౌండ్స్‌లో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరుగుతున్న సమయంలో బాధిత యువతి స్పృహతప్పి పడిపోయింది.
తాను స్పృహలో లేని సమయంలో అంబులెన్స్‌లో ఉన్నవాళ్లు మానభంగానికి పాల్పడ్డారంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను స్పృహలో లేకపోవడంతో అంబులెన్స్‌లో ఏం జరిగిందో తనకు సరిగా గుర్తులేదని బాధితురాలు పేర్కొంది. అయినప్పటికీ, అరకొరగా తనపై జరిగిన దారుణాన్ని గుర్తించి హాస్పిటల్ అధికారులు, పోలీసులకు వివరించింది. తనపై ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు అత్యాచారం చేశారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు బోధ్‌గయా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఫోరెన్సిక్ టీమ్‌ను కూడా అధికారులు రంగంలోకి దించారు. కేసు నమోదైన కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు పేరు వినయ్ కుమార్ (అంబులెన్స్ డ్రైవర్), మరొకరు అజిత్ కుమార్ (టెక్నీషియన్) అని గుర్తించారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ పోలీసు కస్టడీలో ఉన్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన దర్యాప్తు బృందాలు, అంబులెన్స్ ప్రయాణించిన దారిని, టైమ్‌ను నిర్ధారించారు. మరిన్ని ఆధారాలు సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Read Also- Viral News: నాగుపాముని కొరిక చంపేసిన పసిబాలుడు!
నితీశ్ ప్రభుత్వంపై ఆగ్రహ జ్వాలలు
అంబులెన్స్ సామూహిక అఘాయిత్య ఘటన విషయంలో సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో అధికార కూటమికి చెందిన లోక్ జనశక్తి పార్టీ అధినేత, ఎంపీ చిరాగ్ పాస్వాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్‌లో పరిస్థితులు క్రమంగా లా అండ్ ఆర్డర్, సాంప్రదాయ వ్యవస్థలు దెబ్బ తింటాయని తీవ్రంగా విమర్శించారు. ‘‘ ఈ ఘటన విషయంలో నాకు చాలా బాధగా అనిపిస్తోంది. ఈ ప్రభుత్వానికి నేను మద్దతు ఇస్తున్నాను. కానీ, రాష్ట్రంలో నేరాలు ఘోరంగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితులను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే, దుష్పరిణామాలు ఎదుర్కోక తప్పదు’’ అని పాశ్వాన్ హెచ్చరించారు. అధికార యంత్రాంగం నేరగాళ్ల ముందు మోకరిల్లుతోందని తీవ్ర ఆరోపణ చేశారు. రాష్ట్రంలో వరుసగా హత్యలు, అఘాయిత్యాలు, సామూహిక అఘాయిత్యాలు, దొంగతనాలు, చోరీలు, వేధింపుల ఘటనలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. కొన్ని ఘటనల్లో అరెస్టులు జరుగుతున్నా, ఇలాంటి ఘటనలు ఎందుకు ఇంతగానం జరుగుతున్నాయన్నది అసలు ప్రశ్న అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ ఘటనలకు పాల్పడుతున్నారేమోనని అనుమానం వ్యక్తం చేసిన ఆయన.. వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చిరాగ్ పశ్వాన్ స్పష్టంగా వ్యాఖ్యానించారు.
Read Also- Liver Care: లివర్ ఆరోగ్యాన్ని కాపాడే తేలికైన సలహాలు ఇవే!