Viral News: నాగుపాము (Cobra) కాటుకు గురై ప్రాణాలు కోల్పోయినవారు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. అయితే, బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా బెట్టియా గ్రామంలో ఆశ్చర్యకరమైన (Viral News) ఘటన జరిగింది. కేవలం ఒక ఏడాది వయసున్న ఓ పసివాడు ఒక నాగుపామును చేతితో పట్టుకొని, నోటితో కొరికి చంపేశాడు. చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో నెమ్మదిగా పాకుకుంటూ వచ్చిన పాము, అతడి చేతికి చుట్టుకుంది. దీంతో, అసౌకర్యానికి గురైన ఆ చిన్నారి పామును బలంగా కొరకడంతో కోబ్రా అక్కడికక్కడే చచ్చిపోయింది.
ఏడాది వయసున్న ఆ చిన్నారి పేరు గోవింద. పామును కొరికిన తర్వాత బాలుడు కూడా అపస్మార స్థితిలోకి జారుకున్నాడు. కొన్ని గంటల తర్వాత అతడి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో, కుటుంబ సభ్యులు వెంటనే హాస్పటల్‌కు తీసుకెళ్లారు. తొలుత సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి బెట్టియా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు (GMCH) రిఫర్ చేశారు. అక్కడి బాలుడి ఆరోగ్యం మెరుగుపడింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని జీఎంసీహెచ్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని వివరించారు. పాము విష గ్రంథుల ద్వారా బాలుడి నోట్లోకి విషయం వచ్చి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు.
Read Also- Liver Care: లివర్ ఆరోగ్యాన్ని కాపాడే తేలికైన సలహాలు ఇవే!
నాగుపాము బాగా దగ్గరికి రావడంతో బాలుడు ఆటకు అసౌకర్యంగా భావించి ఉంటాడని, అందుకే పాముని కొరికి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై గొవింద బామ్మ మాతేశ్వరి దేవి మాట్లాడారు. గొవిందను ఒక దగ్గర ఉంచి తల్లి కట్టెలు సేకరిస్తోందని, అదే సమయంలో పాము వచ్చిందని చెప్పారు. ‘‘పాము వచ్చింది. తొలుత దేనితోనే కొట్టాడు. ఆ తర్వాత కొరికి చంపేశాడు. అది నాగుపాము. గోవింద ప్రస్తుత వయసు ఒక ఏడాది’’ అని మాతేశ్వరి వివరించారు.
నరాలపై గురి
నాగుపాము చాలా విషపూరితమైనది. ఇది నరాలను (నర్వ్ సిస్టమ్) లక్ష్యంగా చేసుకొని కాటువేస్తుంది. వేగంగా చికిత్స అందకపోతే ప్రాణాలు కోల్పోయే ముప్పు ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో ప్రతిరోజూ సుమారు 100కు పైగా పాము కాట్లు నమోదవుతాయని గణాంకాలు చెబుతున్నాయి. ఏడాదికి సుమారుగా 50,000 మంది వరకు పాము కాట్లకు గురై మరణిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణమవుతున్న నాలుగు జాతుల్లో నాగుపాము, క్రైట్, రస్సెల్ వైపర్, సా-స్కేల్ వైపర్‌లు ఉన్నాయి.
Read Also- Sunjay Family: సంజయ్ కపూర్ ఫ్యామిలీలో ‘రూ.30 వేల కోట్ల’ చిచ్చు
పాము కాటుకు గురైన వ్యక్తికి తక్షణమే యాంటీవెనం (విషానికి విరుగుడు) ఇవ్వకపోతే ప్రభావిత వ్యక్తి చనిపోతాడు. కొన్ని ప్రాంతాల్లో మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రాకపోవడంతో అనేక మరణాలు సంభవిస్తున్నాయి. ఎవరికైనా పాము కరిస్తే చికిత్స పొందడానికి ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బాధితుడికి గాలి ఆడేలా, ఆందోళనకు గురిచేయకుండా చూసుకోవాలి. శరీరంపై కాటు వేసిన ప్రదేశానికి పైభాగంలో గట్టిగా కట్టువేయాలి. ఆ తర్వాత వెంటనే వెంటనే ఆసుపత్రికి తరలించాలి. కాటుకు గురైన వ్యక్తే పాముని చంపాలని, కాటు చేసిన చోట నోటి కొరిక విషం లాగేయడం వంటివి చేయకూడదని, వాటి వల్ల ప్రయోజనం ఉండదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.