Rishab Pant: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానం వేదికగా ఇంగ్లాండ్-భారత్ జట్ల మధ్య జరుగుతున్న 2వ టెస్ట్ మ్యాచ్ 4వ రోజున టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ సంచలన రికార్డు నెలకొల్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ ఔటైన తర్వాత క్రీజులో అడుగుపెట్టిన పంత్ భారీ రికార్డు బద్దలు కొట్టాడు. ఆతిథ్య జట్టు పేసర్ జోష్ టంగ్‌ను బౌలింగ్‌లో అద్భుతమైన సిక్సర్ బాదడంతో టెస్టు ఫార్మాట్‌లో ఇంగ్లండ్ గడ్డపై 21 కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో విదేశీ గడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన అంతర్జాతీయ ఆటగాడిగా ఈ రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా గడ్డపై ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ సాధించిన 21 సిక్సర్ల రికార్డును పంత్ బద్ధలుకొట్టాడు. ఇక, ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో 16 సిక్సులతో వెస్టిండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ 2వ స్థానంలో నిలిచాడు.
Read Also- Weight Loss: బరువు తగ్గాలనుకునేవారికి కొత్త ట్రిక్.. పొట్ట మటుమాయం!
కాగా, రెండవ టెస్టు రెండవ ఇన్నింగ్స్‌తో రిషబ్ పంత్ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. దూకుడుగా ఆడిన పంత్ 58 బంతుల్లో 65 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. టీమిండియా 400 పరుగుల స్కోర్‌ను అందుకోవడం కీలక పాత్ర పోషించాడు. ఇక, మొదటి ఇన్నింగ్స్‌లో 279 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ శుభ్‌మాన్ రెండవ ఇన్నింగ్స్‌లో సెంచరీ నమోదు చేశాడు.
Read also- Personal Finance: త్వరగా కోటీశ్వరులు కావాలంటే ఎఫ్‌డీ మంచిదా?, సిప్ కరెక్టా?
కాగా, ఓవర్ నైట్ స్కోర్ 64/1తో (రెండవ ఇన్నింగ్స్) భారత్ 4వ రోజు బ్యాటింగ్‌కు దిగింది. 71 ఓవర్లు ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 4 వికెట్ నష్టానికి 336 పరుగులు సాధించింది. క్రీజులో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ 124 (బ్యాటింగ్), రవీంద్ర జడేజా 35 (బ్యాటింగ్ చేస్తున్నారు. మిగతా బ్యాటర్ల విషయానికి వస్తే, ఓపెనర్ యశస్వి జైస్వాల్ 28 పరుగులు, కేఎల్ రాహుల్ 55 రన్స్, కరుణ్ నాయర్ 26 పరుగులు, రిషబ్ పంత్ 65 చొప్పున పరుగులు సాధించి ఔటయ్యారు. ప్రస్తుతానికి భారత్ 520కి పైగా పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. సెకండ్స్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలర్లలో జాష్ టంగ్ 2 వికెట్లు, కార్సే, షోయబ్ బషీర్ చెరో వికెట్ తీశారు.
Read also- Weight Loss: బరువు తగ్గాలనుకునేవారికి కొత్త ట్రిక్.. పొట్ట మటుమాయం!
కాగా, తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 587 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ అత్యధికంగా 269 పరుగులు సాధించారు. ఇక, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌట్ అయ్యింది. హ్యారీ బ్రూక్ 158, జేమీ స్మిత్ 184 పరుగులతో భారీ శతకాలు సాధించారు. భారత బౌలర్లలో స్టార్ పేసర్ మహ్మద్ షమీ అత్యధికంగా 6 వికెట్లు సాధించాడు. మిగతా 4 వికెట్లు ఆకాశ్ దీప్ సాధించాడు.