Weight loss tips
Viral, లేటెస్ట్ న్యూస్

Weight Loss: బరువు తగ్గాలనుకునేవారికి కొత్త ట్రిక్.. పొట్ట మటుమాయం!

Weight Loss: పేగు ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు, మేలు కారణంగా ఇటీవల కాలంలో ఫైబర్ ఫుడ్‌కు (Fibre Food) ప్రాధాన్యత ఇస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, పేగు ఆరోగ్యమే కాదు, బరువు తగ్గుదలకు కూడా ఈ ఫుడ్ చాలా దోహదపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు ఒక క్రమపద్ధతిని పాటిస్తూ, నిర్దిష్ట మోతాదును జాగ్రత్తగా తీసుకుంటే చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. వెయిట్ లాస్ కావాలనుకునేవారు ఫైబర్ ఫుడ్‌ను ఏవిధంగా తినాలో తెలియపరుస్తూ ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ జోసెఫ్ సల్హాబ్ జూన్ 29న మూడు చక్కటి చిట్కాలు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. డాక్టర్ జోసెఫ్ ఏం చెప్పారో మీరు కూడా తెలుసుకోండి మరి.

ఫైబర్‌తో బరువు తగ్గుతారా?
క్రమం తప్పకుండా ఏడాదిపాటు ఫైబర్ ఫుడ్‌ను క్రమ పద్ధతిలో తీసుకొని, అద్భుతమైన ఫలితాన్ని సాధించిన ఓ వ్యక్తికి సంబంధించిన టిక్‌టాక్ వీడియోను డాక్టర్ సల్హాబ్ తన పోస్ట్‌లో స్టిచ్ చేసి చూపించారు. ఆ వ్యక్తి చాలా తెలివిగా తన శరీరంలోకి ఇన్సులిన్ చేరే ముప్పును నివారించుకుంటూ బరువు తగ్గించుకున్నారు. ఫైబర్ తినడం ద్వారా ఫ్యాటీ లివర్ వ్యాధి కూడా తోకముడిచేలా చేశారు. ఇందుకోసం ఆ వ్యక్తి అవలంభించిన విధానాన్ని ఒకసారి పరిశీలిస్తే, డయాబెటిస్‌కు కారణమయ్యే షుగర్ కంటెంట్ ఉండే ఆహార పదార్థాలు తినడానికి ముందే ఫైబర్ ఫుడ్‌ను తినేవాడు. 12 నెలలపాటు ఇదే విధానాన్ని కొనసాగించాడు. షుగర్ ఉండే ఆహార పదార్థాలు తినడానికి ముందే ఫైబర్ ఫుడ్ తినేవాడు. దీంతో, అతడి బరువు ఊహించని విధంగా తగ్గింది. 12 నెలల్లో తన బాడీలో వచ్చిన పరివర్తనకు సంబంధించిన వీడియోను కూడా ఆ వ్యక్తి షేర్ చేశాడు. ఆ వ్యక్తి పాటించిన విధానం గురించి తాను చెప్పడం కాస్త ఇబ్బందికరంగానే ఉందని డాక్టర్ జోసెఫ్ చెప్పారు. అతడు పాటించిన విధానం ఇంటర్నెట్‌లో ఉందంటే తాను నమ్మలేకపోతున్నానని ఆయన పేర్కొన్నారు. మరికొంతమందికి దోహదపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోను షేర్ చేస్తున్నట్టు ఆయన వివరించారు.

Read also- Personal Finance: త్వరగా కోటీశ్వరులు కావాలంటే ఎఫ్‌డీ మంచిదా?, సిప్ కరెక్టా?

ఫైబర్ ఫుడ్ వాడిన వ్యక్తి 2023 మార్చి నెలలో పొట్టతో కనిపించగా, పన్నెండు నెలల పొట్ట మటుమాయం అయింది. షుగర్‌కు సంబంధించిన ఆహారం తినడానికి ముందు ఫైబర్ ఫుడ్ తినడం ద్వారా అతను ఏకంగా 75 పౌండ్లు (34 కేజీలు) బరువు తగ్గాడు. నిజానికి తాను డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రారంభ సంకేతాలు ఉన్నాయని చెప్పారు, కానీ, ప్రస్తుతం తానున్న స్థితి ఇదీ అంటూ సదరు వ్యక్తి ఆనందం వ్యక్తం చేశాడు. ‘‘ నేను 34 కేజీల బరువు తగ్గాను. ఇప్పుడు నా శరీరంలో ఇన్సులిన్, ఫ్యాటీ లివర్ వ్యాధి లక్షణాలు లేవు. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ (కొవ్వు) ఫుడ్స్ తగ్గించాను. డయాబెటిస్‌ తగ్గుదలకు ఫైబర్ చాలా సహాయపడుతోంది. ఎందుకంటే రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో, జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడంలో సహాయ పడుతుంది. అదనంగా, ఊబకాయం తగ్గుదలకు కూడా సాయపడుతుందని అన్నారు.

ఫైబర్‌ను ఎలా తినాలి?
ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే ఫైబర్‌ను ఎలా తినాలనేది చాలా ముఖ్యం. ఈ విషయంలో డాక్టర్ జోసెఫ్ సల్హాబ్ చెబుతున్న మూడు చిట్కాలు ఇవే.
1.ఫైబర్‌లో ఎక్కువ మొత్తాన్ని రోజు ఆరంభంలోనే తినాలి. శరీరంలో ఫైబర్ బాగా పనిచేయాలంటే నీరు అవసరం. కాబట్టి, నిద్రపోతున్నప్పుడు, ఉపవాసంలో ఉన్న సమయంలో ఫైబర్ అంత మంచి ఫలితాన్ని ఇవ్వదు, ప్రభావవంతంగా పనిచేయదు.
2. రోజుకు కనీసం 30 నుంచి 35 గ్రాముల వరకు ఫైబర్ ఫుడ్ తినాల్సిన అవసరం ఉంటుంది. అయితే, తొలుత తక్కువ మొత్తంలో ప్రారంభించాలి. వారానికి కొన్ని గ్రాముల చొప్పున ఫైబర్ ఫుడ్‌ను తీసుకోవడం పెంచాలి. అలా చేస్తే ఉబ్బరం, తిమ్మిరి వచ్చే అవకాశాలు ఉండవు. క్రమంగా పెంచుకోవడం ద్వారా శరీరాన్ని కూడా అలవాటు అవుతుంది.
3. ఫైబర్‌కు పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు చక్కటి వనరులు. అదనంగా ఫైబర్ అవసరం అనుకుంటే, సైలియం పొట్టు, చియా గింజలు, అవిసె గింజల రూపంలో తీసుకోవచ్చు.

Read Also- Uddhav-Raj: ఒక్కటైన థాక్రే బ్రదర్స్.. 20 ఏళ్లక్రితం అసలు ఎందుకు విడిపోయారో తెలుసా?

గమనిక: పలు అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Just In

01

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం