IPL Final 2025: ఐపీఎల్ 2025 ఫైనల్ (IPL 2025 Final) మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 సాధించింది. దీంతో, పంజాబ్ కింగ్స్ లక్ష్యం 191 పరుగులుగా ఖరారైంది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సారధ్యంలోని పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ కూడా అత్యంత పటిష్టంగా ఉండడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ తరపున స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరోసారి మెరిశాడు. 35 బంతులు ఎదుర్కొని 43 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 3 బౌండరీలు ఉన్నాయి. విరాట్ ఆరంభంలో వికెట్లు పడకుండా ఆచితూచి జాగ్రత్తగా ఆడాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయినప్పటికీ ఫర్వాలేదనిపించారు. దీంతో, ఆర్సీబీ భారీ స్కోర్ సాధించగలిగింది.
Read this, IPL 2025 Final: ఐపీఎల్ కోసం పెళ్లి పక్కనెట్టేశాడు.. ఆ క్రికెటర్ నిజంగా గ్రేట్!
ఆర్సీబీ స్కోర్ బోర్డు
ఫిలిప్ సాల్ట్ 16 పరుగులు, విరాట్ కోహ్లీ 43, మయాంక్ అగర్వాల్ 24, రజత్ పటీదార్ 26, లియామ్ లివింగ్‌స్టోన్ 25, జితేష్ శర్మ 24 పరుగులు చొప్పున కీలకమైన రన్స్ రాబట్టారు. మిగతావారిలో రొమారియో షెఫర్డ్ 17, కృనాల్ పాండ్యా 4, భువనేశ్వర్ కుమార్ 1, యష్ దయాల్ 1 (నాటౌట్) చొప్పున పరుగులు సాధించారు.
Read this, IPL Final 2025: ఆర్సీబీకి మాజీ ప్రధాని ఫుల్ సపోర్ట్.. కారణాలు ఇవే!
ఇక, పంజాబ్ కింగ్స్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో అంతగా రాణించలేదనే చెప్పాలి. వరుస విరామాల్లో వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. అయితే, ఆర్సీబీ జట్టు 200 పరుగుల కంటే ఎక్కువ భారీ స్కోర్ సాధించకుండా ఆర్సీబీ బ్యాటర్లను విజయవంతంగా నిలువరించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ వికెట్ తీసిన ఒమర్జాయ్, విజయ్ కుమార్ పరుగులు నియంత్రించాడు. కైల్ జెమీసన్ అత్యధికంగా 3 వికెట్లు, అర్షదీప్ సింగ్, ఒమర్జాయ్, విజయ్ కుమార్ తలో రెండేసి వికెట్లు తీశారు.
Read this, RCB Fan: కప్ కోసం ఎంతకు తెగించార్రా.. ఆర్‌సీబీ ఫ్యాన్ పనికి అవాక్కవాల్సిందే!