RCB Fan Celebrations: ప్రస్తుతం, ఎక్కడా చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్ హడావుడి కనిపిస్తుంది. ఎందుకంటే, 18 ఏళ్లు పట్టింది కప్పును అందుకోవడానికి. మిగతా క్రికెటర్లు అందరూ ఇతర టీమ్స్ కు మారారు కానీ, విరాట్ కోహ్లీ మాత్రం ఒకే ఆర్సీబీ లోనే 5 కాదు, 10 కాదు.. ఏకంగా 18 ఏళ్లు ఓకే టీం లో ఉన్నాడు. ఇప్పుడు ఏ సోషల్ మీడియా చూసిన ఆర్సీబీ కి సంబంధించిన పోస్టులే దర్శనమిస్తున్నాయి.
Also Read: Kamal Haasan: హై కోర్టు తీర్పు తర్వాత.. సంచలన నిర్ణయం తీసుకున్నకమల్ హాసన్.. షాక్ లో ఫ్యాన్స్
ఐపీఎల్ 2025 మ్యాచ్ లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ పై 6 పరుగుల తేడాతో గెలిచింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోవడం ఏంటని చాలా మంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి అభిమానుల కల నెరవేరింది. ప్రతీ సీజన్ అనుకునేవాళ్ళు.. ఒక్కసారైనా కప్పు కొడితే బాగుండు అని.. ఎట్టకేలకు 2025 లో నిజమైంది. కప్పు కొట్టాలని ఎంతో మంది పూజలు కూడా చేశారు. ఇక పల్లెటూళ్లలో అయితే సంబరాలు జరుపుకుంటున్నారు. సందడే సందడి అన్నట్లు ఉంది.
ఆర్సీబీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్
ఇక కోహ్లీ డై హార్ట్ ఫ్యాన్స్ అయితే, కేకులు కట్ చేసుకుని ఈ విజయాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కొందరైతే ఆర్సీబీ కప్పు కొట్టిందని 100 మేకలు 250 కోళ్ళతో 3 గ్రామాల్లో భోజనాలు పెడుతున్నారు. ఇది చూసిన నెటిజన్స్ మరి ఇంత అభిమానం ఏంటండీ బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Tamannaah Bhatia: ఆ స్టార్ హీరోతో అడ్డంగా దొరికిపోయిన తమన్నా.. కొత్త బాయ్ ఫ్రెండ్ ను సెట్ చేసుకుందా?
కోహ్లీ ఎమోషనల్ సీన్
20 వ ఓవర్లో ఇంకా 4 బాల్స్ మిగిలి ఉండగా.. ఆర్సీబీ గెలుపు ఖాయమవ్వడంతో విరాట్ కోహ్లీ చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక గ్రౌండ్ లోనే ఏడ్చాడు. అంటే ఇన్నేళ్ళు ఎంత బాధను మోసి ఉంటే ఒక్కసారిగా కన్నీళ్ళు బయటకు వస్తాయి. ఏదైనా ఈసాలా కప్ నమ్దూ.. అని చెప్పి మరి కొట్టారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.