jobs ( Image Source: Twitter)
Viral

RBI Recruitment 2025: రూ.78 వేల జీతంతో ఆర్‌బీఐలో ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేసుకోండి!

RBI Recruitment 2025: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. గ్రేడ్ ‘బి’ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 120 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ క్యాడర్, డీఈపీఆర్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్), డీఎస్ఐఎం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్) విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్నవారు సెప్టెంబర్ 30, 2025 లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లై చేయడానికి RBI అధికారిక వెబ్‌సైట్ rbi.org.in ని విజిట్ చేయండి.

పోస్టుల వివరాలు

మొత్తం ఖాళీలు: 120జనరల్ క్యాడర్: 83 పోస్టులు
డీఈపీఆర్: 17 పోస్టులు
డీఎస్ఐఎం: 20 పోస్టులు

Also Read: Warangal District: రజాకార్లపై విరోచితంగా పోరాడిన యోధుల గాధ.. స్వేచ్ఛ అందిస్తున్న ప్రత్యేక కథనం

పరీక్షల షెడ్యూల్

జనరల్ క్యాడర్:ఫేజ్-I: అక్టోబర్ 18, 2025
ఫేజ్-II: డిసెంబర్ 6, 2025

పరీక్షల షెడ్యూల్: జనరల్ క్యాడర్:ఫేజ్-I: అక్టోబర్ 18, 2025
ఫేజ్-II: డిసెంబర్ 6, 2025

డీఈపీఆర్ & డీఎస్ఐఎం:ఫేజ్-I: అక్టోబర్ 19, 2025
ఫేజ్-II: డిసెంబర్ 7, 2025

Also Read: Flyovers Safety: పీజేఆర్ ఫ్లైఓవర్ పై ప్రమాద నివారణ చర్యల పరిశీలన: జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే

అర్హతలు

వయస్సు: సెప్టెంబర్ 1, 2025 నాటికి 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీలు (SC/ST/OBC), దివ్యాంగులు, మాజీ సైనికులు, ఉన్నత విద్యార్హతలు ఉన్నవారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు

జనరల్ క్యాడర్: ఏదైనా సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60% మార్కులు లేదా పోస్ట్-గ్రాడ్యుయేషన్‌లో 55% మార్కులు.
డీఈపీఆర్: ఎకనామిక్స్/ఫైనాన్స్‌లో మాస్టర్ డిగ్రీతో 55% మార్కులు.
డీఎస్ఐఎం: స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్‌లో మాస్టర్ డిగ్రీ లేదా 4-సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీలో 60% మార్కులు.

Also Read: Vegetable storage: కూరగాయలను ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటాయని తెలుసా?

జీతం

బేసిక్ పే: నెలకు రూ. 78,450 ను జీతాన్ని చెల్లిస్తారు.
మొత్తం జీతం (భత్యాలతో కలిపి): సుమారు రూ. 1.5 లక్షలు/నెల

దరఖాస్తు రుసుము

జనరల్/OBC/EWS: రూ. 850 + GST
SC/ST/దివ్యాంగులు: రూ. 100 + GST
RBI స్టాఫ్: రుసుము మినహాయింపు

ఎలా అప్లై చేయాలి?

1. RBI వెబ్‌సైట్ rbi.org.in లోకి వెళ్లండి.
2. “Opportunities@RBI” సెక్షన్‌లో గ్రేడ్ ‘బి’ నోటిఫికేషన్ క్లిక్ చేయండి.
3. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌ను పూరించి, రుసుము చెల్లించండి.
4. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి.

Just In

01

Lawyers Fight: హైకోర్టులో షాకింగ్ ఘటన.. జడ్జి ముందే గొడవ పడ్డ లాయర్లు.. వీడియో వైరల్

Offers On iPhone: ఐఫోన్14పై భారీ డిస్కౌంట్.. ఎప్పటినుంచంటే?

Hyderabad Crime: కూకట్ పల్లి కేసులో కీలక అప్డేట్స్.. రంగంలోకి ప్రత్యేక బృందాలు

Raghava Lawrence: అప్పుడు కష్టపడిన డబ్బుతో కొన్న ఇంటిని.. లారెన్స్ ఏం చేశాడో తెలుసా?

Girls on Married Men: పెళ్లైన మగాళ్లపై అమ్మాయిలు ఎందుకు మోజు పడుతున్నారు? దాని వెనుకున్న కారణాలివే!