Flyovers Safety (imagecredit:swetcha0
హైదరాబాద్

Flyovers Safety: పీజేఆర్ ఫ్లైఓవర్ పై ప్రమాద నివారణ చర్యల పరిశీలన: జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే

Flyovers Safety: ప్రతి జీవితం విలువైనది. నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలు కోల్పోకూడదని అని పునరుద్ఘాటించారు. సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీ ఛైర్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే(Justice Abhay Manohar Sapre) వ్యాఖ్యానించారు. హైదరాబాద్(Hyderabad) నగరమంతటా రోడ్డు నిర్వహణ, సేఫ్టీ మెరుగుపరచడంలో జీహెచ్ఎంసీ(GHMC) తీసుకున్న చర్యలు బాగున్నాయని కూడా ఆయన ప్రశంసించారు. గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్‌(RV Karnana)తో కలిసి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే, జూబ్లీ హిల్స్‌-మాదాపూర్‌కు అనుసంధానించే జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 ఫ్లైఓవర్‌ను, కొండాపూర్ ను గచ్చిబౌలిని కలిపే పీజేఆర్ ఫ్లైఓవర్‌ పైన ప్రమాదాలు జరగకుండా జీహెచ్ఎంసీ తీసుకున్న భద్రత చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే

హెచ్చరిక సైన్ బోర్డులు(Warning signboards), రేడియం స్టిక్కర్లు(Radium Stickers), సీసీ కెమెరాలు(CCTV Cameras) వేగాన్ని నియంత్రించడానికి రంబుల్ స్ట్రిప్‌లు, చెవ్రాన్ బోర్డులు, కాంక్రీట్ అడ్డంకులు, రాత్రిపూట లైటింగ్ కోసం వీధి లైట్ల ఏర్పాట్లు సహా అనేక భద్రతా చర్యలను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రయాణికులు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా తీసుకున్న పటిష్ట చర్యలను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ కూలంకుశంగా వివరించారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు జీహెచ్ఎంసీ తీసుకున్న భద్రత చర్యల పట్ల జస్టిస్ సప్రే సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జస్టిస్ నానక్‌రామ్‌గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్ జీసీఎల్) కార్యాలయాన్ని సందర్శించారు, అక్కడ అధికారులు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పై ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

Also Read: PM Modi: భారత్‌తో వాణిజ్య చర్చలు.. ట్రంప్ పోస్టుకు.. ప్రధాని ఆసక్తికర ఆన్సర్!

నిఘా చర్యలతో పాటు..

ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (Intelligent Transport System), హైవే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (Highway Traffic Management System) వంటి అధునాతన సాంకేతికతల ద్వారా నిర్వహించబడే ఔటర్ మీదుగా ప్రతిరోజూ రెండున్నర లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయని అధికారులు తెలిపారు. ప్రమాదాలు జరగకుండా పటిష్ట పర్యవేక్షణ, భద్రత, నిఘా చర్యలతో పాటు, అనుకోకుండా వాహనదారులు ప్రమాదాల బారిన పడినప్పుడు వెంటనే స్పందించి తక్షణ సహాయం అందించేలా, అత్యవసర వైద్య చికిత్స కోసం చేసిన ఏర్పాట్లను అధికారులు వివరించారు. ఈ సందర్శనలో జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ ( మెయింటనెన్స్) సహదేవ్ రత్నాకర్‌ లు జస్టిస్ వెంట ఉన్నారు.

Also Read: Charlie Kirk: ట్రంప్ సన్నిహితుడు దారుణ హత్య.. భవనం పైనుంచి షూట్ చేసిన అగంతకుడు

Just In

01

Jogulamba Gadwal: గద్వాల జిల్లాలో దారుణం.. ప్రైవేట్ స్కూల్ వ్యాన్ బోల్తా

Prabhas movie update: ‘రాజాసాబ్’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ రెడీగా ఉండండి

Hyderabad Metro: మెట్రో నడపడం మా వల్ల కాదు.. ఆదాయం సరిపోవట్లేదు.. కేంద్రానికి ఎల్&టీ లేఖ

TGMDC Sand Policy: లారీ యజమానుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్!

Gold Rate Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్..