Ramya Moksha Pickles: మొన్నటి వరకు ఏ సోషల్ మీడియాలో ఫ్లాట్ ఫామ్ చూసిన అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు బాగా వినిపించింది. మీ పచ్చడి రేట్లు ఏంటి మరి ఇంత ఎక్కువగా ఉన్నాయని నార్మల్ గా అడిగినందుకు.. కస్టమర్లు అని చూడకుండా.. పికిల్స్ యజమాని అలేఖ్య బూతులతో పిచ్చిగా పిచ్చిగా తిట్టేసింది. పచ్చళ్లు గురించి కాకుండా .. వాట్సాప్ లో అసభ్యపదాలు మాట్లాడుతూ మెసేజ్ లు పంపింది. ఇవి వైరల్ కావడంతో సోషల్ మీడియా మొత్తం మారు మోగింది. రేటు గురించి అడిగితే వాటి గురించి దాని గురించి మాట్లాడాలి కానీ, బూతులు ఎలా తిడతారంటూ ఆమెపై అందరూ మండిపడ్డారు. అయితే, తాజాగా అలేఖ్య చిట్టి సంచలన వీడియో రిలీజ్ చేసింది.
అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం కాస్తా సద్దు మనిగింది. ఈ నేపథ్యంలోనే అలేఖ్య చిట్టి సిస్టర్ రమ్య గోపాల్ కంచర్ల ఒక వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేసింది. మళ్లీ రాబోతున్నాం.. మా నెక్స్ట్ బిజినెస్ ఇదే అంటూ కొత్త విషయాల గురించి అందరితో షేర్ చేసింది.
Also Read: Kothagudem: డ్రంక్ అండ్ డ్రైవ్ మందుబాబులకు భారీ జరిమానా… ఎంతో తెలిస్తే షాక్!
” మేము పెట్టిన పచ్చళ్ల బిజినెస్ కొన్ని నెలలు పాటు ఊహించని విదంగా నడిచింది. కానీ, ఒక్క కాంట్రవర్సీ వల్ల మూసేస్తామని మేము అనుకోలేదు. ఆ బిజినెస్ కథ అయితే ముగిసింది. తర్వాత ఏం చేయాలనే డైలమాలో ఉన్నాము.
Also Read: Lokesh Kanagaraj: యువ హీరో శ్రీరామ్ హెల్త్‌పై లోకేశ్ కనగరాజ్ పోస్ట్.. అసలు శ్రీరామ్ ఎవరు?
అలేఖ్య చిట్టి పికిల్స్ పేరును రమ్య మోక్ష పికిల్స్ (Ramya Moksha Pickles) పేరుతో మళ్లీ వద్దామని అనుకుంటున్నాం. కానీ, అంత ముందులాగా మీ సపోర్ట్ ఉంటుందా లేదా లేదో తెలియదు. మేము అయితే కంబ్యాక్ ఇస్తాము. పాత కస్టమర్లు మళ్లీ రావాల్సిందే అంటూ రిక్వస్ట్ చేస్తున్నారు.
ఇప్పుడు రమ్య మోక్ష పికిల్స్ తో ధరకు తగ్గ క్వాలిటీ కూడా కస్టమర్లకు అందిస్తాం. దీనిలో, మా అక్క అలేఖ్య ఎంటర్ కూడా అవ్వదు. మొత్తం, నేను మాత్రమే చూసుకుంటా. త్వరలో, రమ్యమోక్ష పికిల్స్‌తో మీ ముందుకు రాబోతున్నాం. కాకపోతే, రెండు నెలలు వరకు సమయం పట్టొచ్చు. ఇప్పటి వరకు మమ్మల్ని ఎంత సపోర్ట్ చేశారో.. ఇకపై కూడా అలాగే, ఆదరిస్తారని అనుకుంటున్నాను.’’ అంటూ ఆమె మాటల్లో చెప్పుకొచ్చింది.
ఈ వీడియో పై నెటిజన్స్ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. మరి కొందరు, మళ్లీ ఎందుకండి రిస్క్, పికిల్స్ కాకుండా వేరేది పెట్టుకుంటే మంచిదని అంటున్నారు. ఇంకొందరు, మీరు గట్టిగా కంబ్యాక్ ఇవ్వండి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు