Kothagudem [ image creit: free pic]
ఖమ్మం

Kothagudem: డ్రంక్ అండ్ డ్రైవ్ మందుబాబులకు భారీ జరిమానా… ఎంతో తెలిస్తే షాక్!

Kothagudem: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నిందితులుగా ఉన్న 15 మంది వ్యక్తులకు న్యాయస్థానం జరిమానా విధించింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించిన ముగ్గురికి కూడా కోర్టు జరిమానా విధించింది.  కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు విచారణ అనంతరం తీర్పులు వెల్లడించారు. కేసుల వివరాల్లోకి వెళితే… పాల్వంచ టౌన్ ఎస్ఐ డి. రాఘవయ్య వాహనాల తనిఖీ చేస్తుండగా ఐదుగురు వ్యక్తులు అతిగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి, బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించారు.

మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో వారిని కోర్టులో హాజరుపరిచారు. విచారణలో నేరం అంగీకరించడంతో ఐదుగురికి జరిమానా విధించారు.
కొత్తగూడెం త్రీటౌన్ ఎస్ఐ పురుషోత్తం తనిఖీలు నిర్వహించినప్పుడు నలుగురు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు తెలిసి, బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో రుజువై కోర్టుకు హాజరు పరచగా, నలుగురూ నేరాన్ని అంగీకరించడంతో జరిమానా విధించారు.

 Also Read: Bhu Bharati Act: మీ భూమి సమస్యకు ఇక పరిష్కారం.. భూభారతిలోనే.. కొత్తగూడెం కలెక్టర్!

ఇక ట్రాఫిక్ ఎస్ఐ ఎస్.కె మదార్ తనిఖీలు చేపట్టిన సమయంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారిని కోర్టులో హాజరుపర్చగా నేరాన్ని అంగీకరించడంతో ముగ్గురికి జరిమానా విధించారు. అదేవిధంగా వన్‌టౌన్ ఎస్ఐ జి. విజయ తనిఖీల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించడంతో కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు జరిమానా విధించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?