Lokesh Kanagaraj: హీరో శ్రీరామ్ (Sree Ram) హెల్త్ అప్డేట్ అంటూ తాజాగా కోలీవుడ్ మాస్ అండ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. శ్రీరామ్ అనగానే అంతా ‘రోజా పూలు’ శ్రీరామ్ అని అనుకుంటారేమో. ఆ శ్రీరామ్ అందరికీ తెలిసిన వాడే. కానీ ఇక్కడ చెబుతున్న శ్రీరామ్ ఓ యంగ్ హీరో. ఈ శ్రీరామ్‌కి ఏమైంది? పైగా అతని ఆరోగ్యానికి సంబంధించి దర్శకుడు లోకేష్ కనగరాజ్ పోస్ట్ చేయడం ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి కదా! అసలు విషయంలోకి వస్తే..
Also Read- Samantha: సమంత ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇలా జరిగిందేంటి?
ఇక్కడ లోకేష్ కనగరాజ్ పెట్టిన పోస్ట్‌లో ఉన్న శ్రీరామ్ ఎవరంటే.. శ్రీ నటరాజన్ (Sri Natarajan). లోకేష్ కనగరాజ్ రూపొందించిన ‘మా నగరం’ మూవీ చిత్ర హీరో. ఈ మధ్య శ్రీ నటరాజన్ అలియాస్ శ్రీరామ్‌ని చూసిన వారంతా షాకయ్యారు. ఆయన పెట్టిన పోస్ట్‌లు అభ్యంతరకరంగా ఉండటంతో అతనికి మానసిక వ్యాధి ఏదో వచ్చిందనేలా అందరూ కామెంట్స్ చేశారు. నిజమే ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగోలేదు. మెంటల్‌గా డిస్టర్బ్ అయి ఉన్నాడు. అందుకు కారణం ఏమిటనేది పక్కన పెడితే, తన తల్లిదండ్రులకు ఆయన దూరంగా ఉంటున్నాడట. దీంతో, శ్రీరామ్‌పై కోలీవుడ్‌లో వరుస కథనాలు వినిపిస్తున్నాయి. ఈ కథనాలపై తాజాగా లోకేష్ కనగరాజ్ వివరణ ఇచ్చారు.
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) April 18, 2025
ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆయన ఓ లెటర్‌ను షేర్ చేశారు. ఇందులో.. ‘‘నటుడు శ్రీరామ్ హెల్త్ విషయంలో ఆందోళన చెందుతున్న శ్రేయోభిలాషులు, స్నేహితులకు మా విన్నపం. ప్రస్తుతం శ్రీరామ్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. వైద్యుల సూచన మేరకు కొన్నిరోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. కాబట్టి అతడి వ్యక్తిగత గోప్యతకు ఇబ్బంది కలిగించవద్దు. అదే విధంగా, అతని ఆరోగ్యంపై తప్పుడు కథనాలు సృష్టించి అందరినీ ఆందోళనకు గురయ్యేలా చేయవద్దు. ఇప్పటికే వస్తున్న వార్తలను చూసి మా కుటుంబమంతా ఎంతో బాధపడుతున్నాం. దయచేసి శ్రీరామ్ హెల్త్ విషయంలో ఇప్పటికే ఏమైనా అభ్యంతరకరమైన వీడియోలు, ఇంటర్వ్యూల వంటివి ఎవరైనా పోస్ట్ చేసి ఉంటే వాటిని వెంటనే తొలగించాలని కోరుతున్నాము’’ అని శ్రీరామ్ పేరెంట్స్ చెబుతున్నట్లుగా ఓ లెటర్‌ను లోకేష్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుండటంతో పాటు, ఎవరా శ్రీరామ్ అనేలా నెటిజన్లతో సెర్చింగ్‌కు కారణమవుతోంది.
Also Read- Manchu Lakshmi: మంచు లక్ష్మి ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేశారో.. ఇక అంతే!
శ్రీరామ్ విషయానికి వస్తే, చెన్నైకి చెందిన అతను నటనపై ఉన్న ప్యాషన్‌తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ‘వళక్కు ఎన్ 18/9’ అనే సినిమాతో హీరోగా పరిచయమై, ఆ తర్వాత ‘ఒనాయుమ్ ఆటకుట్టియుమ్’, ‘సోన్ పాపిడి’, ‘విల్ అంబు’, ‘మా నగరం’ వంటి పలు చిత్రాలలో నటించి, నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే, కొన్ని రోజులుగా అతను షేర్ చేస్తున్న పోస్ట్‌లు అభ్యంతరకరంగా మారాయి. నిజంగా ఇది అతనే చేస్తున్నాడా? అనుకునేవారంతా, ప్రస్తుత ఆయన రూపం చూసి, శ్రీరామ్‌కి ఏదో అయిందనేలా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. కట్ చేస్తే, లోకేష్ కనగరాజ్ ఇప్పుడిలా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌తో శ్రీరామ్ ఆరోగ్య పరిస్థితిని అందరికీ తెలిసేలా చేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు