Priyanka Chopra and Samantha
ఎంటర్‌టైన్మెంట్

Samantha: సమంత ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇలా జరిగిందేంటి?

Samantha: నిజంగా ఇది సమంత ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూసే. ఎందుకంటే, ఈ మధ్యకాలంలో సమంత సినిమాలను బాగా తగ్గించేసింది. తెలుగు సినిమాలైతే అస్సలు చేయడం లేదు కూడా. బాలీవుడ్‌లో కూడా కేవలం వెబ్ సిరీస్‌లు మాత్రమే చేస్తుంది. తెలుగులో మాత్రం ఇటీవల ఓ సినిమాను నిర్మిస్తుంది. మరో తెలుగు సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేస్తున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో సమంత నటనను చూడాలంటే ఇక ఆప్షన్ కేవలం వెబ్ సిరీస్‌లే. ఇక ఇప్పుడీ వెబ్ సిరీస్‌ల విషయంలో కూడా ఆమెకు బ్రేక్ పడిందనేలా ఓ వార్త ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Single Song: దిల్ రాజుని అలా.. అల్లు అరవింద్‌ని ఇలా.. ఆ స్టెప్ అరవింద్‌దేనా?

బాలీవుడ్ హీరో వరుణ్‌ ధావన్‌, సమంత జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌: హనీ-బన్నీ’. రీసెంట్‌గానే ఈ వెబ్ సిరీస్ అమెజాన్‌లో విడుదలైన ఘన విజయాన్ని అందుకుంది. ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌ నటించిన వెబ్‌ సిరీస్‌కి ఇండియన్‌ వెర్షన్‌గా ఈ హనీ బన్నీ రూపొందింది. ఇటీవల వరుణ్ ధావన్ త్వరలోనే ‘సిటాడెల్‌: హనీ-బన్నీ’ పార్ట్ 2 ఉంటుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ సిటాడెల్ సిరీస్‌కు సంబంధించి ఓ బాంబ్ పేల్చారు. ఈ వెబ్ సిరీస్‌కు సీజన్‌2ను రద్దు చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

ప్రియాంకా చోప్రా నటించిన సిటాడెల్‌ ఆధారంగానే ఇండియన్‌ వెర్షన్‌, ఇటాలియన్‌ వెర్షన్‌లు రూపొందాయి. తాజాగా ఈ రెండింటికి సంబంధించిన కొనసాగింపులను రద్దు చేస్తున్నట్లుగానూ, అందుకు బదులుగా వీటిని ఒరిజినల్ వెర్షన్‌లో విలీనం చేయనున్నట్లుగా తెలిపారు. ఈవిషయంపై అమెజాన్‌ ప్రతినిధులు వివరణ ఇస్తూ.. సిటాడెల్‌: హనీ-బన్నీ, సిటాడెల్‌: డయానా తర్వాత సీజన్లను నిలిపివేసి, వాటి సీక్వెల్ కథలన ఒరిజినల్‌లో విలీనం చేస్తున్నాం. ఈ సిరీస్‌ అన్ని భాషల్లోనూ గొప్ప విజయం సాధించింది. ఇది మాకు ఎమోషనల్ జర్నీ. ఒరిజినల్‌ను మరింత గొప్పగా ప్రేక్షకులకు అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

Also Read- Jeevitha Rajashekar: జీవితా రాజశేఖర్‌కు ఊహించని బాధ్యత.. ఇది ఎవ్వరూ ఊహించలే!

దీంతో ఈ సిరీస్‌లో సీక్వెల్స్ కోసం ఎంతగానో వేచి చూస్తున్న వారందరూ నిరాశకు లోనవుతున్నారు. ఇదేంటి? ఇలా జరిగింది. మేకర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేంటి? కారణం నిజంగా వాళ్లు చెప్పేదేనా? లేక వేరే ఏదైనా ఉందా? అనేలా కామెంట్స్ చేస్తున్నారు. ఇక సమంత ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త తెలిసి తెగ ఫీలైపోతున్నారు. కనీసం వెబ్ సిరీస్‌లైనా చేస్తుంది కదా అనుకుంటే.. ఇప్పుడసలుకే ఎసరు వచ్చిందని, ఇక సమంత ఎలా ప్రేక్షకుల ముందుకు వస్తుందో ? అనేలా ఆలోచనలు చేస్తున్నారు. నిజమే, వారి ఆలోచనలలో కూడా నిజం లేకపోలేదు. ఎందుకంటే, సమంత ఒక సినిమా, సిరీస్ ఏదైనా ఒప్పుకుని చేస్తే అది ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పడం కష్టం. అలాంటిది ఇప్పుడు ఏకంగా సిరీస్‌నే రద్దు చేశారని అంటున్నారు. మరి ఫ్యాన్స్‌కు నిరాశ కలగకుండా ఎలా ఉంటుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు