Jeevitha Rajashekar: జీవితా రాజశేఖర్ గురించి టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటిగా ఎన్నో చిత్రాలలో నటించిన జీవితా, ఆ తర్వాత యాంగ్రీమ్యాన్ రాజశేఖర్‌ని పెళ్లి చేసుకుని యాక్టింగ్‌కు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత దర్శకురాలిగా ఎన్నో చిత్రాలను రూపొందించారు. సినిమాల పరంగా ఇలా ఉంటే, రాజకీయాల పరంగానూ జీవిత, రాజశేఖర్‌లు ఎప్పుడూ వార్తలలో నిలుస్తూనే ఉంటారు. వారు ఏ నిమిషాన ఏ పార్టీలో ఉంటారో చెప్పడం చాలా కష్టం. వారిప్పుడు ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు? అంటే టక్కున చెప్పడం చాలా కష్టం. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌లుగా ఈ జంట నిలుస్తుంటారు.
Also Read- Manchu Lakshmi: మంచు లక్ష్మి ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేశారో.. ఇక అంతే!
అలాగే ఈ మధ్య ఓ అవార్డుల కమిటీలో జీవిత ఉన్నందుకు కూడా కొన్ని ఆరోపణలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అందుకు జీవిత కూడా స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయింది. ఇంకా ‘మా’ ఎన్నికలు, పదవి.. ఇలా నిత్యం ఏదో ఒక రకంగా జీవిత, రాజశేఖర్ వార్తలలో నిలుస్తూనే ఉంటారు. ఈ మధ్య కాస్త తగ్గింది కానీ, ఆ మధ్య మాత్రం వీరి గురించే మీడియా మైకులు పట్టుకుని తిరగాల్సి వచ్చేది. అలా ఉండేవి వాళ్ల డైలీ కార్యక్రమాలు. కొన్నాళ్లుగా కాంట్రవర్సీలకు, ఇతర అంశాలకు దూరంగా ఉంటూ వస్తున్న జీవితకు ఇప్పుడు ఊహించని బాధ్యతని తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది. అదేంటని అనుకుంటున్నారా?
కళాకారులను గుర్తించి, సత్కరించే ఆచారాన్ని గత ప్రభుత్వాలు పక్కన పెట్టేసినా, ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం, ఆయన సీఎం అయినప్పటి నుంచి కళాకారులకు తగిన గుర్తింపును ఇస్తూ వస్తున్నారు. ఇక నంది అవార్డ్స్ స్థానంలో ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్’ (Gaddar Telangana Film Awards) పేరిట ఇకపై కళాకారులను సత్కరించుకుంటామని కూడా ప్రకటించారు. అది కేవలం ప్రకటనగా పక్కన పెట్టేయకుండా అవార్డులు ఇచ్చేందుకు ఓ కమిటీని సైతం ఏర్పాటు చేశారు. ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీకి జ్యూరీ ఛైర్మన్‌గా జయసుధను ఎంపిక చేసిన విషయం విదితమే. ఇప్పుడీ కమిటీలో జీవితా రాజశేఖర్‌కు కూడా చోటు కల్పించారు.
Also Read- Sreemukhi: శ్రీముఖికి హీరోయిన్ ఛాన్స్? నెటిజన్స్ డిమాండ్ ఇదే..
15 మంది ఉన్న ఈ కమిటీలో జీవితా రాజశేఖర్ ఓ మెంబర్‌గా ఉన్నారు. తాజాగా ఈ కమిటీ మెంబర్స్‌ని అధికారికంగా ప్రకటించారు. ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్’ నిమిత్తం ఏర్పాటైన జ్యూరీ మెంబర్స్ లిస్ట్ ఇదే: (Gaddar Awards Jury Members)
1. నటి జయసుధ (ఛైర్మన్)
2. నటి జీవితా రాజశేఖర్ (మెంబర్)
3. డైరెక్టర్ దశరధ్ (మెంబర్)
4. డైరెక్టర్ బీవీ నందినీ రెడ్డి (మెంబర్)
5. ఎగ్జిబిటర్ ఈ. విజయ్ కుమార్ రావు (మెంబర్)
6. జర్నలిస్ట్ లక్ష్మీ నారాయణ (మెంబర్)
7. డైరెక్టర్ ఎల్. శ్రీనాధ్ (మెంబర్)
8. ఫిల్మ్ ఎనలిస్ట్ అకునూర్ గౌతమ్ (మెంబర్)
9. లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ (మెంబర్)
10. డైరెక్టర్ సి. ఉమా మహేశ్వరరావు (మెంబర్)
11. డైరెక్టర్ శివనాగేశ్వరరావు (మెంబర్)
12. డైరెక్టర్ వి.ఎన్. ఆదిత్య (మెంబర్)
13. జర్నలిస్ట్ జి. వెంకట రమణ (మెంబర్)
14. ప్రొడ్యూసర్ ఏడిద రాజా (మెంబర్)
15. టిజిఎఫ్‌డిసి ఎమ్.డి (మెంబర్)
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు