Silver Wedding Card: భారతీయ సంప్రదాయంలో వివాహానికి విశిష్టమైన గుర్తింపు ఉంది. పేదల నుంచి ధనికుల వరకూ ప్రతీ ఒక్కరూ వివాహానికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా ధనవంతులు తమ పిల్లల పెళ్లిలను అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఎన్నో ప్రణాళికలు వేస్తుంటారు. వినూత్నమైన ఆలోచనలు చేసి తమ బిడ్డ పెళ్లిని నలుగురు గుర్తుంచుకునేలా చేసేందుకు యత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే రాజస్థాన్ కు చెందిన ఓ వ్యాపారి.. తన కూతురి వివాహానికి సంబంధించి ఖరీదైన అహ్వన పత్రికను రూపొందించి వార్తల్లో నిలిచారు.
వివరాల్లోకి వెళ్తే..
రాజస్థాన్ జైపూర్ కు చెందిన వ్యాపారవేత్త శివ్ జోహారి.. తన కుమార్తె పెళ్లి కోసం ఖరీదైన ఆహ్వాన పత్రికను తయారు చేయించారు. స్వచ్ఛమైన వెండిని ఉపయోగించి.. 3 కేజీల బరువున్న వెడ్డింగ్ కార్డును ప్రత్యేకంగా రూపొందించారు. 8 x 6.5 అంగుళాల సైజ్ లో ఒక బాక్స్ రూపంలో దీనిని తయారు చేయించారు. దీని విలువ రూ.25 లక్షలు పైనే ఉంటుందని తెలుస్తోంది.
65 మంది దేవతా ప్రతిమలు..
కూతురి పెళ్లి కోసం ప్రత్యేకంగా చేయించిన ఈ బాక్స్ లో 65 మంది దేవీ దేవతాల ప్రతిమలు చెక్కించబడి ఉన్నాయి. విఘ్నేశ్వరుడు, శివుడు, పార్వతి దేవి, మహా విష్ణువు, లక్ష్మీ దేవి, తిరుమల బాలాజీ విగ్రహాన్ని బాక్స్ లోపల ఏర్పాటు చేశారు. అలాగే మధ్యలో వధువు శ్రుతి జోహారి, వరుడు హర్ష్ సోని పేర్లను కవితా శైలిలో చెక్కించారు. ఏనుగులు వారి పేర్ల చుట్టూ నిలబడి పుష్పాలు కురిపిస్తున్నట్లుగా కార్డును డిజైన్ చేశారు. అలాగే గుడి లాంటి నిర్మాణాలు, ద్వార పాలకులు. బాజా భజంత్రీలు మోగించేవారితో ఈ ఆహ్వాన పత్రిక చూపరులను కట్టి పడేస్తోంది.
Also Read: Educated Couple Begging: భర్త ఎల్ఎల్‌బీ.. భార్య బీకాం కంప్యూటర్స్.. అయినా భిక్షాటనే మార్గం!
కాబోయే అత్తకు అందజేత..
తన కుమార్తె కాబోయే అత్తకు ఈ ఖరీదైన ఆహ్వాన పత్రికను శివ్ జోహారి అందించడం విశేషం. తన కుమార్తె అడుగుపెట్టే ఇంటిలో సుఖ సంతోషాలతో పాటు దేవీ దేవతల అనుగ్రహం కూడా ఉండాలని ఇలా చేసినట్లు వ్యాపారి శివ్ జోహారి తెలియజేశారు. తన కుమార్తె వివాహానికి బంధువులతో పాటు దేవతామూర్తులను ఆహ్వానించాలని భావిస్తున్నట్లు చెప్పారు. కొత్త జంట జీవితాంతం ఆనందంగా ఉండాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
5520
[Breaking News] #1929
Jaipur jeweller Shiv Johri created a 3-kg silver wedding card for daughter's marriage, costing ~₹25 lakh, taking 1 year. Features intricate carvings of 65 deities, Krishna Leelas, Vishnu's 10 avatars. "Wanted God's blessings visible," he said. Follow… pic.twitter.com/ZjGURut0GE— Sayaji Samachar Network (@SayajiSamacharX) January 20, 2026

