Origin of God: అసలు ఈ దేవుడంటే ఎవరు? దేవుని అస్థిత్వం ఎలా ఉంటుంది. పురాణా గ్రంధాల్లో చెప్పిన విధంగా ఈ సృష్టిని, ఈ భూమిని , ఈ మనుషులును , ఈ జీవులను పుట్టించింది దేవుడైతే, మరి దేవుడిని పుట్టించింది ఎవరు? కుల, మత అనేవి ఎప్పటి నుంచి ఏర్పడ్డాయి. ఇలాంటి ఆసక్తి కర విషయాలు ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..
దేవుడే తనని కనుగొనేలా చేశారా?
చుట్టూ చీకటి, ఊరుములు, మెరుపులు జోరున వర్షం ఆది మానవుల మొదటి కాలం. నిప్పే లేని కాలం. ఇంత వరకు లేని విధంగా ఆ రోజు ఆయనకు ఎంతో బాధగా అనిపిస్తుంది. కనీసం నేలపై పడుకోలేని అతని బతుకు. పోనీ ఎక్కడైనా పొదల్లో తల దాచుకుందామంటే అది కూడా జరగని పని. ఇంక చేసేదేమి లేక చెట్ల కొమ్మల పైనే ఉండి, తడుస్తూ నరకం అనుభవిస్తున్న ఆ ఆది మానవుడు వెలుగు కోసం చూస్తూ ఉన్నాడు. ఉదయం అయితే, జంతువుల నుంచి తప్పించుకుందామని చెట్ల పైనే దాక్కూంటూ బిక్కు బిక్కున కూర్చొని ఉన్నాడు. ఇక నెమ్మదిగా సూర్యుడు ఉదయించాడు. దాన్ని చూడగానే ఆ ఆది మానవుడుకి కొండంత ధైర్యం వచ్చింది. అప్పుడు చరిత్రలో నిలిచిపోయే ఒక సంఘటన జరిగింది. ఆ ఆది మానవుడు రెండు చేతులతో సూర్యుడికి దండం పెట్టాడు. ఇక అప్పటి నుంచి సూర్యుడు సూర్య భగవానుడయ్యాడు. కాలం గడుస్తున్న కొద్దీ మనిషి, నిప్పును కనుగొన్నాడు. ఇక సూర్యుడితో అవసరం లేకుండా నిప్పు వాళ్ళకి ప్రశాంతమైన నిద్రను కలుగజేసింది. దీంతో, నిప్పుకి కూడా రెండు చేతులెత్తి దండం పెట్టారు. అప్పుడు నిప్పు కాస్తా అగ్ని దేవుడయ్యాడు.
పంచభూతాలే మొదటి దేవుళ్ళా?
రోజులు గడుస్తున్నాయి. మనిషి ఆలోచనా విధానం కూడా మారిపోయింది. వ్యవసాయం చేయడం కూడా మొదలు పెట్టాడు. తనకి ఉపాధి కల్పించిన భూమిని, ఆకలిని తీర్చిన పంటని మనసారా కొలవడం మొదలు పెట్టాడు. అలా మనిషి పంచభూతాలను కనుగొని, వాటికి చేతిలెత్తి మొక్కాడు. ఆ రోజుల్లో పంటలు బాగా పండితే ఒక పండుగలా జరుపుకునే వాళ్లు. ఆ సమయంలో అందరూ కలిసి మెలిసి ఉండే వాళ్ళు. ఇలా గుంపుగా అందరూ ఒకేసారి కలవడం వలన అప్పుడు మతం పుట్టింది. మతమంటే ఇప్పుడు మనం చెప్పుకునేది కాదు, బతికే జీవన విధానం.
Also Read: Water: వాటర్ క్యాన్ లో నీళ్ళను రెండు రోజులకి మించి వాడుతున్నారా.. అయితే, డేంజర్లో పడట్టే?
ఈ ప్రకృతి లేకుండా మనం భూమి మీద జీవించలేము. మీరు ఈ ప్రకృతికి మొక్కిన, మొక్కకపోయిన గాలి వీస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, నీరు దాహం తీరుస్తుంది. ఇలా పంచభూతాలు వాటి పని అవి ఎలా చేసుకుంటున్నాయో మనిషి కూడా తన పని తాను చేసుకుంటే ఎలాంటి సమస్యలు రావు
