BSNL Diwali Offer: బీఎస్ఎన్ఎల్‌లో రూ.1కే అపరిమిత కాల్స్, 2జీబీ డేటా – కొత్త సిమ్ ఉచితంగా!
ప్రభుత్వ రంగ టెలికాం రంగంలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) దీపావళి పండుగ సందర్భంగా తన యూజర్లకు అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఇంత వరకు ఎవరూ పెట్టలేని విధంగా కేవలం ఒక్క రూపాయి కే రీఛార్జ్ ఆఫర్ పెట్టింది.
ఎవరూ కూడా చేయలేని సాహసం చేసి కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసి, ప్రైవేట్ టెలికాం దిగ్గజాలకు పెద్ద ఛాలెంజ్ విసిరింది.
‘BSNL ఈ దీపావళి పండుగకు’ (BSNL Diwali Bonanza Offer) కొత్త ఆఫర్ ను ప్రకటిస్తూ ఈ ప్లాన్ ను తమ కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. వీటితో పాటు సిమ్ కార్డు ను ఇవ్వబోతుంది. ఈ ఆఫర్ గురించి చాలా మందికి తెలియదు. అసలు దీన్ని ఎక్కడ పొందోచ్చు? ఎప్పటి వరకు వ్యాలిడిటీ అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
ఆఫర్ వివరాలు: రూ.1కే 30 రోజులు ఫుల్ సర్వీసెస్!
దీపావళి పండుగ సమయంలో కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి బీఎస్ఎన్ఎల్ ఈ బొనాంజాను కొత్తగా రూపొందించింది.
అపరిమిత వాయిస్ కాల్స్: దేశవ్యాప్తంగా ఏ ఆపరేటర్‌కు అయినా అన్‌లిమిటెడ్ టాక్‌టైమ్.
రోజువారీ 2జీబీ హై-స్పీడ్ డేటా: వీడియో స్ట్రీమింగ్, బ్రౌజింగ్, సోషల్ మీడియా వాడటానికి సరిపడా.
రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు: సందేశాలు ఫ్రీగా పంపవచ్చు.
ఉచిత సిమ్ కార్డ్: కొత్త కనెక్షన్ యాక్టివేట్ చేసేటప్పుడు సిమ్ ఫ్రీగా ఇస్తారు.
ఈ ఆఫర్ కొత్త యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది అంటే, ముందు బీఎస్ఎన్ఎల్ కస్టమర్ కాని వారికి మాత్రమే. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ సిమ్ ఉన్నవారు ఈ ప్లాన్‌ను ఉపయోగించలేరు. బీఎస్ఎన్ఎల్ తన అధికారిక ఎక్స్ (ట్విటర్) అకౌంట్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేసి ప్రకటించింది.
ఎప్పుడు, ఎలా పొందాలి?
ఈ కొత్త ప్లాన్ 30 రోజుల మాత్రమే ఉంటుంది ఈ నెల అక్టోబర్ 15, 2025 నుంచి మొదలయ్యి వచ్చే నెల నవంబర్ 15, 2025 వరకు మాత్రమే ఉంటుంది. అంటే దీపావళి సీజన్ కి మన ముందుకు తీసుకొచ్చారు.
యాక్టివేషన్ ప్రాసెస్: సమీప బీఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్ లేదా అధికారిక రిటైలర్‌ను సంప్రదించండి. అక్కడ మీ వ్యక్తిగత డాక్యుమెంట్లు ఆధార్ కార్డ్ ను చూపించి, ఒక రూపాయిని చెల్లించి సిమ్ కార్డ్ ను తీసుకోండి. 30 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. రూరల్ ఏరియాల్లో బీఎస్ఎన్ఎల్ కవరేజ్ బాగుంది కాబట్టి, ఈ ఆఫర్ ఆ ప్రాంతాల్లో మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
