Water: వాటర్ క్యాన్లు ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా కనిపిస్తాయి. ఎందుకంటే, మన ఇళ్లలో ఉదయం లేచిన దగ్గర నుంచి అన్ని అవసరాలకు ఈ వాటర్ ను ఉపయోగిస్తాము. అయితే, చాలామంది బయటి నుండి మినరల్ వాటర్ తెచ్చుకోవడానికి ఈ క్యాన్లను ఉపయోగిస్తారు. నీటిని నింపే ముందు క్యాన్లను శుభ్రం చేస్తారు, కానీ వాటి లోని నీటిని ఎంతకాలం వాడాలనేది మాత్రం కొంచం కూడా ఆలోచించరు.
Also Read: Reel vs Reality: మనం చూసేవన్ని నిజాలు కావు.. ఈ భూమి మీద వేటిని కూడా టచ్ చెయ్యట్లేదని మీకు తెలుసా?
క్యాన్స్ లో వాటర్ ను రెండు రోజులకి మించి వాడుతున్నారా..?
కొందరు రోజుల తరబడి, మరికొందరు 15 రోజుల పాటు, ఇంకొందరైతే వాటర్ పాడైపోయే వరకు వాడుతూనే ఉంటారు. అయితే, ఇలా ఎక్కువ కాలం వాటర్ ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వైద్యుల సలహా ప్రకారం, వాటర్ క్యాన్లను లోని నీళ్ళను కేవలం మూడు రోజులకి మించి వాడకూడదని హెచ్చరిస్తున్నారు. ఏం కాదులే అని మీరు ఆ నీళ్ళను ఉపయోగిస్తే, క్యాన్లలో ఉండే బ్యాక్టీరియా ఏర్పడి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఆ నీళ్లు తాగిన తర్వాత కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా, ఇలా ఎక్కువ రోజులు వాడితే రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. శరీరంలో బ్యాక్టీరియా పెరిగి, వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాదు, ఆ తర్వాత జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో తరచూ సమస్యలు వస్తాయి. చివరికి ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బ తిని నడవలేకుండా అయిపోతారు. అంతేకాక, బయటి వాటర్ ప్లాంట్ల నుండి తెచ్చే నీటిలో కెమికల్స్ ఎక్కువగా ఉండటం వల్ల కండరాల పనితీరు, ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.
Also Read: Ghosts: దెయ్యాలు నిజంగా ఉన్నాయా? ప్రతి రోజూ ఆ గంట సమయంలో బయట తిరుగుతున్నాయా?
