Divvala Madhuri : శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ ఇటీవల చురుగ్గా కనిపిస్తున్నారు. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురై, ప్రస్తుతం ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తున్న ఆయన, ధర్మాన, కింజరాపు కుటుంబాలను రాజకీయంగా టార్గెట్ చేస్తూ తన సామాజిక వర్గాన్ని ఏకం చేసే ప్రయత్నంలో ఉన్నారు. అదే సమయంలో, ఆయన ప్రేయసి దివ్వెల మాధురితో కలిసి వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టి, సోషల్ మీడియా ద్వారా స్వయంగా ప్రమోషన్ చేస్తూ వ్యాపార విస్తరణపై దృష్టి సారించారు.
మాధురిలో కొత్త అవతారం
టెక్కలికి చెందిన దివ్వెల మాధురి, కూచిపూడి, భరతనాట్యం డాన్స్ మాస్టర్‌గా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆమె అనేక మందికి నృత్యం నేర్పడంతో పాటు, సేవా కార్యక్రమాలు, మహిళల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఈ నేపథ్యంలోనే దువ్వాడ శ్రీనివాస్‌తో సన్నిహితంగా మారారు. గతేడాది ఈ జంట హైదరాబాద్‌లో వ్యాపార కార్యకలాపాలకు పరిమితమై, ఇటీవల శ్రీకాకుళంలో మళ్లీ కనిపించారు.
పొలంలో మాధురి సందడి
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా తమ వ్యాపార ప్రకటనలను స్వయంగా రూపొందిస్తూ యాక్టివ్‌గా ఉన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో దమ్ములు, వరి నాటు వేసే సీజన్ నడుస్తున్న వేళ, మాధురి మహిళలతో కలిసి వరి నాట్లు వేస్తూ పొలం పనుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “మాధురి కొత్త అవతారం” అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: Swathi Murder Case: ఇంకా దొరకని స్వాతి శరీర భాగాలు.. మొండాన్ని తీసుకెళ్లబోమన్న కుటుంబీకులు