Kamakhya Temple: ఒక అమ్మాయికి పీరియడ్స్ వస్తే ఈ రోజు నుంచి ఐదు రోజుల వరకు టెంపుల్ దగ్గరికి వెళ్లొద్దని మన పెద్దలు చెబుతారు. కానీ, ఇప్పుడు ఇక్కడ చెప్పబోయే అమ్మ వారికి ప్రతి ఏడాది పీరియడ్స్ వస్తాయని చెబుతున్నారు. ఏంటి ఇది నిజమేనా ? అని అనుకుంటున్నారా? ఇది వందకి వంద శాతం నిజమే. మరి, ఆ దేవత ఎవరు? ఆమె ఎక్కడ ఉంటారు? ఇలా దీని గురించి ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Mysterious Temples: శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని అత్యంత రహస్యమైన దేవాలయాలున్నాయని తెలుసా?
అక్కడి అమ్మ వారికీ ప్రతీ ఏడాది పీరియడ్స్ వస్తాయా?
ఆ దేవత ఎవరో కాదు.. కామాఖ్య అమ్మ వారు. అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఉన్న కామాఖ్య టెంపుల్. ఇక్కడ ఉన్న వారందరూ కామాఖ్య దేవతని పూజిస్తారు. అయితే, ఇక్కడ అమ్మ వారికి ఎలాంటి విగ్రహం ఉండదు. విగ్రహం ప్లేస్ లో ఒక రాతితో చేసిన ఆకారం కనిపిస్తుంది. ఈ గుడి 51 శక్తి పీఠాల్లో ఒకటి. పురాణాల ప్రకారం సతీ దేవి అగ్ని లోకి ప్రాణ త్యాగం చేసింది. అప్పుడు శివుడు ఆమె శవాన్ని భుజాల పైన వేసుకుని తాండవం చేస్తున్న సమయంలో విష్ణువు విశ్వాన్ని కాపాడుకోవడం కోసం సతీ శరీరాన్ని 51 భాగాలుగా విభజిస్తాడు. ఆ భాగాలు ఎక్కడైతే పడ్డాయో అవి శక్తి పీఠాలుగా మారాయి. ప్రతి ఏడాది జూన్ నెలలో మూడు రోజుల పాటు ఈ గుడిని మూసి వేస్తారు. ఎందుకంటే, ఆ రోజుల్లో అమ్మవారికీ పీరియడ్స్ వస్తాయని నమ్ముతారు.
Also Read: Lord Shiva: ప్రళయం వచ్చినప్పుడు శివుడు ఆ ఒక్క నగరాన్ని మాత్రమే రక్షిస్తాడు? దానికి అంతమే లేదా?
ఆ గుడికి పక్కనే ఉన్న బ్రహ్మపుత్ర నదిలోని నీరు ఎరుపు రంగుగా మారుతుంది. ఈ నదిలోని నీరు ఎందుకు ఎర్రగా మారుతున్నాయో ఇంత వరకు ఎవరూ కూడా కనిపెట్టలేకపోయారు. ఒక రకంగా చెప్పాలంటే శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని రహస్యంగా మారింది. నాలుగో రోజు గొప్ప పండుగను జరుపుకుంటారు. అంబుబాచి మేళా . ఈ గుడిని తాంత్రిక శక్తిలకు కూడా ముఖ్యమైన ప్రదేశం అని కూడా చెబుతారు.
