Mysterious Temples: ప్రపంచంలో అత్యంత రహస్యమైన దేవాలయాలు ఉన్నాయి. అయితే, ఇవి ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. మన దేశంలో ఆద్యాత్మికత ఎక్కువగా కనపడుతుంది. భారత దేశంలో శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాలు, పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని విశేషమైన మహిమలు కలిగిన ఆలయాలు గురించి తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు.
అత్యంత రహస్యమైన దేవాలయాలు
లాతు దేవత ఆలయం
ఉత్తరాఖండ్ లో దేవల్ బ్లాక్ లో ఉంది. అక్కడికి వెళ్ళే భక్తులు ఆలయం లోపలకి వెళ్లకుండా 30 అడుగుల దూరంలో ఉండి పూజిస్తారు. ఎందుకంటే, గుడి లోపలకి వెళ్తే గుడ్డి వాళ్ళ లాగా మారతారని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. లాతు దేవత దేవత ఆలయం తలపులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుస్తారు. పూజారి మాత్రమే కళ్ళకి గంతలు కట్టుకుని ఆలయానికి వెళ్తారు. ఎందుకంటే, లాతు ఆలయం లోని కొలువైన నాగరాజు నాగమణి కుర్చో న్నాడని ప్రజలు నమ్మకం. ఈ రత్నం నుంచి వెలువడే ప్రకాశవంతమైన కాంతి సోకిన భక్తుడిని అందుడని చేస్తుందని నమ్మకం. అందువలన పూజారి కూడా కళ్ళకి గంతలు కట్టుకుని శక్తివంతమైన పూజలు చేస్తారు.
కాకన్మత్ శివాలయం
ఈ శివాలయం మధ్యప్రదేశ్ లో ఉండి. ఇది ప్రస్తుతం ఎన్నో రహస్యాలకు నిలయంగా మారింది. ఈ గుడికి వెలుపల కానీ, బయట కానీ తలుపులు లేవు. కేవలం రాళ్ళను ఒక దాని పై ఒకటిని పేర్చి నిర్మించారు. ఈ కట్టడం చూడటానికి చాలా కొత్తగా , షాకింగ్ గా కనిపిస్తుంది. మనం ఏది నిర్మించాలనుకున్నా ముందు పునాది బలంగా ఉండాలి. అలాగే, దాని కోసం సున్నం కానీ, సిమెంట్ ను కానీ ఖచ్చితంగా వాడాలి. అయితే , ఈ గుడి నిర్మాణంలో అలాంటివి ఏవీ కూడా ఉపయోగించలేదు. పెద్ద, చిన్న రాళ్ళను నిలువుగా పేర్చుకుంటూ గోపురాన్ని కట్టారు. ఇది నిజంగా అద్భుతమనే చెప్పుకోవాలి. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. అలాంటి రాళ్ళు చుట్టూ పక్కల కనిపించకపోవడంతో చాలా ఆశ్చర్యంగా ఉంది. రాత్రికి రాత్రే ఏవో శక్తులు వచ్చి ఈ గుడిని నిర్మించారని అక్కడి వారు చెబుతున్నారు. శాస్త్రవేత్తలకు కూడా పెద్ద సవాల్ గా మారింది.
