Tech Services Outage: దేశవ్యాప్తంగా (India) మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో పలు టెక్ సర్వీసులు (Tech News) ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. ఎక్స్ (X), చాట్‌జీపీటీ (ChatGPT), ఏడబ్ల్యూఎస్ (అమెజాన్ వెబ్ సర్వీసెస్), క్లౌడ్‌ఫేర్ (వెబ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ కంపెనీ) సేవల్లో అంతరాయాలు ఏర్పడ్డాయంటూ యూజర్లు చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తమ సమస్యలను తెలిపారు. ఎక్స్ ఫీడ్‌లో సమస్యలు ఎదురయ్యాయని దాదాపు 50 శాతం మంది యూజర్లు చెప్పారు. ఎక్స్ వెబ్‌సైట్‌లో అవాంతరాలు ఏర్పడ్డాయని 29 శాతం మంది యూజర్లు తెలిపారు. ఇక, క్లౌడ్‌ఫ్లేర్ ద్వారా, భారతదేశంలో యూజర్ వెరిఫికేషన్ సర్వీసులు అందుకుంటున్న అనేక కంపెనీలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.
Read Also- Salary increments 2026: వచ్చే ఏడాది శాలరీ ఇంక్రిమెంట్లు ఎలా ఉంటాయో చెప్పేసిన కొత్త సర్వే
క్లౌడ్‌ఫ్లేర్ (Cloudflare) ఒక వెబ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ కంపెనీ. వేలాది వెబ్‌సైట్లకు సీడీఎన్, డీఎన్ఎస్, సెక్యూరిటీ లాంటి సర్వీసులు అందిస్తోంది. క్లౌడ్ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ, నెట్‌వర్కింగ్ కేటగిరిలోకి వచ్చే క్లౌడ్‌ఫ్లేర్ సేవల్లో అంతరాయం ఏర్పడడంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక, చాట్‌జీపీటీ వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. బ్రేకింగ్ న్యూస్‌లు, ప్రకటనలు, రాజకీయ చర్చలు, ట్రెండింగ్ విషయాలకు అడ్డా అయిన ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్‌లో కూడా అవాంతరాలు ఏర్పడడంతో యూజర్లు ఇబ్బందిపడ్డారు.
