Viral Video: మన పెద్దోళ్లు, మిత్రులు అప్పుడప్పుడూ ‘కోతి చేష్టలు చేయొద్దు.. కోతి వేషాలొద్దు.. నువ్వు నీ కోతి పనులు’ అని అంటుంటారు కదా. బహుశా ఈ వీడియో చూసిన తర్వాత ప్చ్.. ఇందుకేనా అని మీకు అర్థమైపోతుంది అంతే. కోతులు అడవుల్లోనే ఉంటాయనేది ఒకప్పటి మాట. ఇప్పుడు మనలో ఒకటిగా కలిసిపోయి ఇంటి చుట్టుపక్కలు, తోటల్లో, పార్కుల్లో, మన ఇంటి ముందే తిరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా.. పర్యాటక ప్రాంతాల్లోని కోతులు తరచుగా మనుషులకు దగ్గరగా వచ్చేస్తుంటాయి. ఎందుకంటే అవి మానవ కార్యకలాపాల ద్వారా ఆహారం పొందడం నేర్చుకున్నాయి కాబట్టి. కొన్నిసార్లు కోతులు ఆహారం కోసం పర్యాటకుల బ్యాగులు, వస్తువులను లాక్కుపోతుంటాయి. ఇదిగో ఈ వీడియోలో కోతి చేసిన చేష్టలు చూడండి..
Read Also- Nara Lokesh: నారా లోకేష్‌కు ప్రమోషన్ పక్కా.. త్వరలోనే డిప్యూటీ సీఎం పదవి!
మీరేం చేస్తారబ్బా?
మామూలుగానే రోడ్డు మీద వెళ్తుంటే పది రూపాయిలు దొరికితేనే ఎంతో హ్యాపీగా మనం ఫీలవుతూ.. జేబులో పెట్టేసుకుంటాం. అలాంటిది డబ్బుల కట్టలున్న బ్యాగ్ దొరికితే ఏం చేస్తాం..? ఆ ఊహ ఎంత బాగుందో కదా..? భద్రంగా దాచుకోవడం, నచ్చిన వస్తువలన్నీ కొనుక్కుంటూ తెగ ఎంజాయ్ చేసేస్తాం కదా. ఇంకా చెప్పాలంటే నీతి, నిజాయితీ అనేవి ఉంటాయ్ కదా.. వాళ్లు మాత్రం తిరిగి ఇచ్చేసి పెద్ద మనసు చాటుకుంటారు. కానీ అదే డబ్బు.. మనిషికి కాకుండా కోతికి డబ్బు దొరికితే ఎలా ఉంటుంది? ఇదిగో ఈ వీడియోలో చూసినట్లుగా ఉంటుంది. తమిళనాడులోని హిల్ స్టేషన్, పర్యాటక కేంద్రమైన కొడైకెనాల్‌లో కోతి విచిత్రమైన పనులు చేసింది. ఓ టూరిస్టు నుంచి బ్యాగును కోతి ఎత్తుకెళ్లింది. సమీపంలోని ఒక చెట్టు పైకి ఎక్కి కూర్చుంది. అబ్బా.. ‘ఎలాగైనా సరే ఈ బ్యాగులో ఉండే తిను బండారాలు అన్నీ నాకే.. ఎవ్వరికీ ఇవ్వను.. ఇవాళ అంతా ఎంజాయ్ చేస్తాను’ అని తెగ హ్యాపీగా ఫీలవుతూ బ్యాగ్ ఓపెన్ చేసింది. సీన్ కట్ చేస్తే అందులో ఒక్క చాక్లెట్, పండూ లేదు. అందులో అన్నీ రూ.500 నోట్ల కట్టలే ఉన్నాయ్. అదంతా డబ్బు అనే విషయం కూడా తెలియక పేపర్లు ఏమో అని నోట్ల కట్టలన్నీ చించివేస్తూ ఇలా పడేసింది. పాపం.. ఆ డబ్బుతో ఏం చేయాలో దిక్కుతోచక తికమక పడుతూ ఇలా విసిరేసింది. బహుశా తినుబండారాలు లేకపోవడంతో నిరాశపడి ఇలా చేసి ఉండవచ్చు. ఇదంతా అక్కడున్న టూరిస్టులు కొందరు తమ ఫోన్‌తో వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇదంతా చూసిన తర్వాత పాపం.. ఆ బ్యాగు యజమాని (బాధితుడు) నవ్వాలో, ఏడవాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
Read Also- Viral Video: 56 ఏళ్ల తర్వాత పుట్టిన ఆడబిడ్డ.. ఈ రాయల్ వెల్కమ్ చూస్తే మైండ్ పోతుందంతే..!
జర జాగ్రత్త గురూ!
సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతున్నది. ఈ కోతి చేష్టలను చూసి నెటిజన్లు, జనాలు ఆశ్చర్యపోవడమే కాకుండా, నవ్వుకుంటున్నారు. ఈ సంఘటన పర్యాటక ప్రాంతాల్లో కోతుల బెడద, వాటి అకస్మాత్తు ప్రవర్తన.. పర్యాటకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. ఈ సంఘటనలు పర్యాటక ప్రాంతాల్లో సాధారణంగా అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. కోతులు ఆహారం కోసం లేదా కుతూహలంతో పర్యాటకుల వస్తువులను లాక్కుపోతుంటాయి. ఇలాంటి సంఘటనలు పర్యాటకులు తమ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని, ముఖ్యంగా ఆహార పదార్థాలను పాలిథిన్ కవర్లలో లేదా కనిపించే విధంగా ఉంచకూడదని గుర్తుచేస్తాయి. కోతులకు ఆహారం ఇవ్వడం వల్ల అవి మరింతగా మనుషులకు అలవాటు పడి, ఇటువంటి చేష్టలు చేయడానికి ప్రోత్సహించినట్లు అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కోతుల చేష్టలు తరచుగా జరుగుతూ ఉంటాయి. కానీ కోతి బ్యాగ్‌లోని డబ్బును విసిరేయడం అనేది ఆ సంఘటనను మరింత వినోదాత్మకంగా వైరల్‌గా మార్చింది.
వీడియో కోసం క్లిక్ చేయండి..
టూరిస్ట్ బ్యాగ్ ఎత్తుకెళ్లి.. ఈ కోతి ఏం చేసిందో చూడండి..
ప్రముఖ పర్యాటక ప్రాంతం కొడైకెనాల్ లో వానరం వింత చేష్టలు
తినుబండారాల కోసం ఓ పర్యాటకుడి నుంచి బ్యాగ్ ఎత్తుకెళ్లి చెట్టుపై కూర్చొన్న కోతి
బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న 500 నోట్ల కట్టను తీసిన వానరం
నోట్లను చెల్లాచెదురుగా… pic.twitter.com/ExMsYpjRng
— BIG TV Breaking News (@bigtvtelugu) June 15, 2025