Lokesh Deputy CM
Politics

Nara Lokesh: నారా లోకేష్‌కు ప్రమోషన్ పక్కా.. త్వరలోనే డిప్యూటీ సీఎం పదవి!

Nara Lokesh: అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే. టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్‌కు త్వరలోనే ప్రమోషన్ రానున్నది. అది కూడా ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రాతినిథ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం (Deputy CM) పదవి చినబాబుకు వస్తుందని, త్వరలోనే మంత్రి లోకేష్‌ను.. డిప్యూటీ సీఎం లోకేష్ అని పిలవాల్సి వస్తుందని విశ్లేషణలు వస్తుండటం గమనార్హం. ఇదంతా అతి త్వరలోనే జరిగిపోతుందనే దానికి సంకేతాలు, చక్కటి ఉదాహరణలు సైతం వివరించి.. విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ ఎవరా విశ్లేషకులు..? సరిగ్గా ఈ సమయంలోనే ఎందుకీ హడావుడి? జనసేన (Janasena) నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తున్నాయ్? అప్పుడు.. ఇప్పుడు ఎందుకీ హడావుడి? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం వచ్చేయండి..

Pawan and Chandrababu

Read Also- Janasena: పుంజుకుంటున్న బీజేపీ.. మంత్రి పదవికే అంకితమైన పవన్.. జనసేనకు ఎందుకీ గతి?

ఇదీ అసలు కథ..
వాస్తవానికి నారా లోకేష్‌ను సీఎం (Chief Minister) చేయాలని.. వీలుకాకపోతే డిప్యూటీ సీఎం చేయాలన్నది ఎప్పట్నుంచో అభిమానుల నుంచి వస్తున్న ఒక పెద్ద ప్రతిపాదన. ఆ మధ్య ఏకంగా టీడీపీ కీలక నేతలు, పొలిట్ బ్యూరో సభ్యులే పలు సభావేదికలు, ఇంటర్వ్యూల్లో మనసులో మాట బయటపెట్టారు. అప్పట్లో ఇదో పెద్ద రాద్ధాంతం జరిగింది. సీన్ కట్ చేస్తే.. టీడీపీ వర్సెస్ జనసేనగా (TDP Vs Janasena) పరిస్థితులు నెలకొన్నది. ఇరు పార్టీల అభిమానులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు కూడా. పరిస్థితి ఇలాగే కష్టమేనని స్వయంగా రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు (CM Chandrababu) వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేశారు. దీంతో ఆ రచ్చ కాస్త తగ్గింది. ఈ మధ్యనే ఓ జాతీయ మీడియాకు ముఖ్యమంత్రి ఇచ్చిన ఇంటర్వ్యూ, కూటమి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా వచ్చిన మీడియా ప్రకటనలు ఇవన్నీ కాస్త నిశితంగా పరిశీలిస్తే ఏదో తేడా కొట్టేట్లు ఉందనే అర్థం చేసుకోవచ్చు. వీటన్నింటినీ బేరీజు చేసుకొని ప్రముఖ విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి (Telakapalli Ravi) లాంటి వారు లోకేష్‌కు ప్రమోషన్ పక్కా అంటూ పలు విషయాలను ఉదహరిస్తూ మాట్లాడుతున్న పరిస్థితి.

Nara Lokesh

ఎప్పట్నుంచో ఉన్నప్పటికీ..?
‘ ఆంధ్రప్రదేశ్‌లో మిశ్రమ ప్రభుత్వం ఏర్పడటం, వేరే పార్టీకి చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడం.. ఏడాది పాలనపై ఈ మధ్యనే సర్వేల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రావడం.. వైసీపీకి సానుకూల పవనాలు వీస్తుండటం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఏం చేస్తోంది.. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని చెప్పిన కూటమి పార్టీలు, అధికారంలోకి వచ్చిన ఏం చేస్తున్నాయి అనేదానిపై ప్రజలకు దృష్టి పెరిగింది. ఇక ఎలాగో రెడ్ బుక్ (Red Book) అనేది ఉన్నది. ఏం జరుగుతోంది అని ప్రజలు ఎదురుచూశారు. వార్షికోత్సవం పెట్టుకున్నారు కానీ, విమాన ప్రమాదంతో జరగలేదు.. వాయిదా పడింది. వాస్తవానికి ఇచ్చిన హామీల్లో ఇంకా చాలా అమలు కావాల్సినవి ఉన్నాయి. సంక్షేమంలో గత ప్రభుత్వంతో పోటీ పడటం మంచిదే కానీ, పాక్షికంగా ఉందనేది ఒక అభిప్రాయం. జనసేన, తెలుగుదేశం పార్టీల్లో పవన్ కళ్యాణ్ పాత్ర, ఐక్యత విషయంలో పరిస్థితులు వేర్వేరుగా ఉన్నాయి. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇవ్వడం ఖాయం. ఎందుకంటే యువ నాయకత్వం అనేది గట్టిగానే తయారవుతోంది. కసరత్తులు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి’ అని తెలకపల్లి రవి వెల్లడించారు.

Telakapalli Ravi

ఇదే క్లియర్ కట్‌గా..
‘ యువ నాయకత్వం కావాలని.. రామ్మోహన్ నాయుడు అని చెబుతున్నారు కానీ, లోకేష్‌కు నాయకత్వం బదలాయింపు అనే ప్రక్రియ పూర్తయ్యిందనే ఇండికేషన్ ఇచ్చేశారు. ఎందుకంటే చంద్రబాబు తర్వాత భువనేశ్వరి, కుటుంబ సభ్యులకు రాజకీయాలపై అంత ఆసక్తి లేదనే విషయం అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా ఓ పెద్ద ప్రకటన దినపత్రికలకు ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే సంకేతాలు చాలానే కనిపిస్తున్నాయి. ఇందులో చంద్రబాబు బొమ్మ పెద్దదిగా ఉండటం.. పైన ఇటువైపు ప్రధాని మోదీ, ఏపీ మ్యాప్.. ఇంకోవైపు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఉన్నారు. ఇది చాలా స్పష్టమైన అంతకుమించి కీలకమైన సంకేతం. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బొమ్మలు ఆఫీసుల్లో పెట్టారు.. పలు కార్యక్రమాల్లో కూడా ఇలాగే జరిగింది. ఆ స్థాయి నుంచి లోకేష్, పవన్ కళ్యాణ్‌ల ఫొటోలు ఒకే సైజులో పెట్టడం, అది కూడా ముఖ్యమంత్రి పక్కన కాకుండా పైన ఫొటోలు పెట్టడం ఇవన్నీ చర్చకు దారితీస్తున్నాయి. రేపొద్దున్న లోకేష్ ఫొటో కిందికి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనుకుంటా. పవన్ కళ్యాణ్ లాగా నారా లోకేష్ కూడా ఉప ముఖ్యమంత్రి అవుతారనే సంకేతాలను ఈ ప్రక్రియ స్పష్టంగా సూచిస్తున్నది’ అని విశ్లేషకుడు తెలకపల్లి రవి చెప్పారు. కాగా, తెలకపల్లి రవి గతంలో కూడా లోకేష్ నాయకత్వ సామర్థ్యాలు, యువగళం పాదయాత్ర వంటి అంశాలపై సానుకూలంగా స్పందించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే అప్పట్లో జనసేన నేతలు, కార్యకర్తలు ‘డిప్యూటీ సీఎం’ వ్యవహారంపై ఎంతలా రియాక్ట్ అయ్యారో.. ఇప్పుడు అంతకుమించి మండిపడుతున్న పరిస్థితి. ఒకవేళ ఇదే నిజం అయితే పవన్ కళ్యాణ్ సంగతేంటి? ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? చివరికి ఏం జరుగునో? ఇంతకీ డిప్యూటీ సీఎం అయ్యే యోగం లోకేష్‌కు ఉందో లేదో చూడాలి మరి.

Pawan And Lokesh

 

Read Also-Tollywood: పవన్ కళ్యాణ్‌ సినిమాలకు బ్రేక్ వేసిందెవరు?.. వైసీపీ కీలక నేత రివెంజేనా?

 

ఇంటర్వ్యూ కోసం క్లిక్ చేయండి..

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?