Girl Child
Viral

Viral Video: 56 ఏళ్ల తర్వాత పుట్టిన ఆడబిడ్డ.. ఈ రాయల్ వెల్కమ్ చూస్తే మైండ్ పోతుందంతే..!

Viral Video: ఆడబిడ్డ అంటే చాలు.. అవసరమా? అంటూ బ్రూణ హత్యలు, వదిలేసి వెళ్లడం ఇలాంటి సంఘటనలు మనం రోజూ దినపత్రికలు, టీవీల్లో చూస్తుంటాం. ఎందుకోగానీ ఆడపిల్ల అంటేనే కొందరు ఎక్కడలేని అక్కసుతో భూమ్మీద పడకుండానే పొట్టన పెట్టుకుంటున్న ప్రబుద్ధులు లెక్కలేనంత మంది ఉన్నారు. అదే మగబిడ్డ అంటే మాత్రం ఆహా.. ఓహో అంటూ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితులనూ చూస్తున్నాం. అందరూ అనట్లేదు కానీ ఇలా చేస్తున్నది కొందరు మాత్రమే. ఇంకొందరు మాత్రం ఆడ అయితే ఏంటి మగ అయితే ఏంటి అన్నట్లుగా ప్రశాంత జీవితం సాగించేస్తున్నారు. కానీ, ఇలాంటి వాటన్నింటికి భిన్నంగా ఓ ఆడశిశువు పుట్టిందని మహారాణి రేంజ్‌లో.. ఇంకా చెప్పాలంటే రాయల్‌గా స్వాగతం పలికారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను (Social Media) షేక్ చేస్తున్నది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎందుకిలా గ్రాండ్ వెల్కమ్ పలికారు? అనే విషయాలు తెలుసుకుందాం రండి..

కనివినీ ఎరుగని రీతిలో..
ఆ ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 56 ఏళ్ల తర్వాత ఆడ బిడ్డ పుట్టింది.. ఒక్కసారి ఊహించుకోండి ఆ కుటుంబ సభ్యుల ఆనందం ఎలా ఉంటుందో..! ఇదిగో ఈ వీడియో చూస్తే ఎలా ఉంటుందనేది మీకే క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. కనివినీ ఎరుగని రీతిలో.. ఈ సంఘటన చూడటానికి రెండు కళ్లు చాలవు అంతే. సినిమాల్లోనే కాదు మరెక్కడా చూడని రీతిలో ఆడబిడ్డకు ఘన స్వాగతం పలికారు. వీఐపీ కంటే ఎక్కువగా భారీగా వాహనాల కాన్వాయితో ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చారు. ఇంటి ముందు అయితే ఢాం.. ఢాం అంటూ పటాసుల శబ్ధంతో దుమ్ము లేచిపోయింది. ఇంటి గేటు మొదలుకుని ఇళ్లంతా బెలూన్స్, పూలతో నిండిపోయింది. అలా వారి సాంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు అన్నీ చేసి, దిష్టితీసి ఇంట్లోకి స్వాగతించారు. చిట్టి పాపాయిని చేతిలోకి తీసుకున్న ఆ తండ్రి ఇళ్లంతా తిరిగాడు.. ఆయన ఆనందానికి అవధుల్లేవ్ అంతే. ఇంకా చెప్పాలంటే.. ‘ ఆడపిల్లలు ఎన్నటికీ మహారాణులే.. వాళ్లు నట్టింట తిరుగాడితే మహాలక్ష్మీ ఇంటికి వచ్చినంత వేడుక’ అని చాటిచెప్పేలా ఈ ఫ్యామిలీ పండుగ చేసుకున్నది. ఈ వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతున్నది.

Read Also- Nara Lokesh: నారా లోకేష్‌కు ప్రమోషన్ పక్కా.. త్వరలోనే డిప్యూటీ సీఎం పదవి!

ఎక్కడ జరిగింది?
ఈ వీడియోను డాక్టర్ చహత్ రావల్ (@dr.chahatrawal) అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేశారు. ‘ మా కుటుంబంలో 56 ఏళ్ల తర్వాత పుట్టిన అమ్మాయి’ అనే క్యాప్షన్‌‌ను జోడించి మరీ ఒరిజినల్ ఆడియోతోనే పోస్ట్‌ చేశారు. ఈ క్యాప్షన్ ఆ కుటుంబానికి ఇది ఎంత పెద్ద విషయమో తెలియజేస్తుంది. వీడియోలో కుటుంబ సభ్యుల ముఖాల్లో కనిపించిన ఆనందం, ఉత్సాహం స్పష్టంగా కనిపించాయి. ఈ వీడియో, పోస్టు చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తూ.. ఆ చిట్టి తల్లికి గ్రాండ్ వెల్కమ్ చెబుతున్నారు. స్వాగతం పలకడంలో ఆ గర్వం, హ్యాపీ.. ఇవన్నీ మాటల్లో చెప్పలేని ఆనందం ఆ కుంటుంబంలో ప్రతిబించిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ వీడియోను 3,47,756 మంది లైక్ చేయగా… లక్షలాది మంది వీక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారి కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఇక కామెంట్స్ గురించి మాటల్లో చెప్పలేం అంతే. ఆడపిల్ల పుడితే ఎలా ఉంటుందనే విషయం ఇలాంటి సంఘటనలు చూసి నేర్చుకోవాలని కొందరు నెటిజన్లు సూచిస్తున్నారు. ఈ వీడియో ఏ ప్రాంతంలో జరిగిందనే విషయం సరిగ్గా తెలియట్లేదు కానీ.. ఢిల్లీలో జరిగినట్లుగా తెలుస్తున్నది. ఆ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ అకౌంట్‌ను క్లియర్ చూస్తే.. ఓ ప్రముఖ ఆస్పత్రిలో చహత్ రావల్ డాక్టర్‌గా పనిచేస్తున్నట్లుగా తెలుస్తున్నది.

Read Also- Nara Lokesh: నారా లోకేష్‌కు ప్రమోషన్ పక్కా.. త్వరలోనే డిప్యూటీ సీఎం పదవి!

ఇకనైనా మారండి..!
ఈ సంఘటన మన సమాజంలో ఇప్పటికీ కొన్ని చోట్ల నెలకొన్న ఆడపిల్లల పట్ల వివక్షకు విరుద్ధంగా ఒక సానుకూల సందేశాన్ని ఇస్తుంది. ఆడపిల్లలు పుడితే నిరుత్సాహపడే లేదా చింతించే వారికి భిన్నంగా, ఈ కుటుంబం ఆడబిడ్డను మహాలక్ష్మిగా భావించి, అద్భుతమైన వేడుక చేయడం ఎంతో మందిని ప్రభావితం చేసే అవకాశం ఉన్నది. ఇది చాలా మందికి ఆడపిల్లల పట్ల సానుకూల వైఖరిని అలవర్చుకోవడానికి ప్రేరణగా నిలిచింది. ఆడపిల్ల అనేది మన ఇంటికి వచ్చింది అంటే శ్రీ మహాలక్ష్మి వచ్చినట్లే. అయితే ఈ మూర్ఖపు రోజుల్లో ఆడపిల్ల వద్దు మగ పిల్లవాడి కావాలి అని తల్లిదండ్రులు చాలామందే ఉన్నారు. అయితే.. ఎందుకు మగ పిల్లవాడు కావాలి? ఆడపిల్ల ఎందుకు వద్దు? అంటున్నారని అడిగితే వాళ్లు సమాధానాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. మగ పిల్లవాడు తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత వాడిది. అదే అమ్మాయి అయితే పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్లి పోతుందని సమాధానం చెబుతున్న పరిస్థితి. అయితే ఇది ఏ మాత్రం కరెక్ట్ కానే కాదు. అమ్మాయిలు కూడా ఉన్నత చదువులు చదువుకొని, ఉద్యోగాలు చేస్తూ.. తల్లిదండ్రులకు వయస్సు వచ్చాక అన్నీ తామై చూసుకుంటున్న సందర్భాలు కోకొల్లలు. అందుకే.. కొందరు వారి మనసుల్లో నుంచి ‘కొడుకే ఒక దేవుడు’ అనే ఆలోచన తీసివేయాలి.. ఇలాంటి మార్పులు వస్తే చాలా మంచిది.

">

 

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్