Mumbai Viral News
Viral, లేటెస్ట్ న్యూస్

Viral News: చొక్కా విప్పేసి.. నడిరోడ్డుపై పొలిటీషియన్ కొడుకు నిర్వాకం

Viral News: సమాజంలో తండ్రి స్థాయి, పదవులను చూసుకొని రెచ్చిపోయిన వారసులు లెక్కకు మించి ఉన్నారు. అలాంటి పుత్ర రత్నమే ఒకరు ముంబైలో వెలుగుచూశారు. మహారాష్ట్రకు చెందిన మరాఠీ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, నటి రాజ్‌శ్రీ మోర్‌ పట్ల మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అగ్రనేతల్లో ఒకరైన జావేద్ షేక్ కొడుకు రాహిల్ జావేద్ షేక్ అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించాడు. రోడ్డుపై తన కారుతో రాజ్‌శ్రీ కారును ఢీకొట్టాడు. ఆ తర్వాత కారు నుంచి బయటకు వచ్చి రాజ్‌శ్రీ కారును కాలుతో తన్నడంతో పాటు ఆమెను దుర్భాషలాడాడు. తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో అతడు అర్ధనగ్నంగా ఉన్నాడు. ఒంటి మీద చొక్కా లేకుండా కారులో కూర్చొని ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజ్‌శ్రీ మోర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై ఫిర్యాదు చేయడంతో ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదయింది.

Read Also- Sehwag Son: సెహ్వాగ్ పెద్ద కొడుకు సంచలనం.. వేలంలో భారీ ధర

జావేద్ షేక్ కారును రాజ్‌శ్రీ వాహనాన్ని ఢీకొనడం, దుర్భాషలాడడం వీడియోలో కనిపించింది. దీంతో, వీడియో వైరల్‌గా మారింది. జావేద్ షేక్ అర్ధనగ్నంగా ఉండడమే కాదు, మద్యం మత్తులో కూడా అనిపిస్తోంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు. నిందితుడు జావేద్ షేక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రాజ్‌శ్రీ డిమాండ్ శారు. ఘటన జరిగినప్పుడు తనపై బెదిరింపులకు దిగారని ఆమె పేర్కొన్నారు.

Read Also- Heart Diseases: గుండె వ్యాధులకు అసలు కారణాలు ఇవేనని మీకు తెలుసా?

కాగా, స్థానిక మహారాష్ట్ర ప్రజలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ కొన్ని వారాల క్రితం రాజ్‌శ్రీ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ వివాదాస్పదమైంది. ఆ సమయంలో ఆమె వార్తల్లో కూడా నిలిచారు. రాష్ట్ర ప్రజలపై మరాఠీ భాషను బలవంతంగా రుద్దుతున్నామని ఆమె అన్నారు. దానికి సంబంధించిన ప్రయత్నాలను ఆమె ప్రశ్నించారు. స్థానిక మరాఠీ ప్రజలు మరింత కష్టపడి పనిచేసే విధంగా పోత్సహించాలని ఆమె పేర్కొన్నారు. వలస వచ్చినవారు ముంబై నగరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతే స్థానిక మరాఠీ సమాజం పరిస్థితి మరింత దిగజారిపోతుందని ఆమె హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓషివారా పోలీస్ స్టేషన్‌లో రాజ్‌శ్రీ మోర్‌పై ఫిర్యాదు కూడా చేశారు. ఈ వ్యవహారంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో రాజ్‌శ్రీ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. తాను పోస్ట్ చేసిన వివాదాస్పద వీడియోను ఆమె తొలగించారు.

Read Also- Viral News: బెంగళూరులో వింత పరిస్థితి.. ఆఫీసులు మూసివేయాలంటూ డిమాండ్లు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు