Shocking Video: భూమిపైన ఉన్న అత్యంత క్రూరమైన మృగాల్లో సింహం (Lion) ఒకటి. అడవులకు రారాజుగా వాటిని పిలుస్తుంటారు. సింహం కనిపిస్తే చాలు.. పెద్ద పెద్ద మృగాలు సైతం అమాడదూరం పారిపోతుంటాయి. అలాంటి సింహం బోనులోకి ఎవరైనా వెళ్లాలని అనుకుంటారా? కానీ ఓ వ్యక్తి అదే సాహసం చేశాడు. ఓ జూలో 20 అడుగుల ఎత్తున్న గోడ దూకి మరి సింహం డెన్ లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అతడు బతికున్నాడా? లేదా? ఈ కథనంలో చూద్దాం.
అసలేం జరిగిందంటే?
బ్రెజిల్ (Brazil)లోని జువాం పెసోవా (João Pessoa) పట్టణంలో గల పార్క్యూ అర్రుడా కమారా (Parque Arruda Câmara) జూలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జంతువులను చూడటానికి జూలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. 20 అడుగుల ఎత్తైన గోడను దూకి జూలోని సింహాలు ఉండే ప్రదేశంలోకి ప్రవేశించాడు. అతడు సింహాల బోనులోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు ఓ వ్యక్తి తన మెుబైల్ లో బంధించాడు.
దాడి చేసిన సింహాం..
చెట్టు కొమ్మ సాయంతో ఆ వ్యక్తి నెమ్మదిగా సింహాల ప్రదేశంలోకి దిగడం వీడియోలో చూడవచ్చు. అతడు కిందికి చేరుకోగానే ఓ సింహం అతడిపై దాడి చేసింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. జూ అధికారులు వెంటనే అప్రమత్తమైనప్పటికీ అతడ్ని కాపాడలేకపోయారు. లియోనా అనే పేరు గల సింహం ఆ వ్యక్తిపై దాడి చేసినట్లు జూ అధికారులు ధ్రువీకరించారు.
Also Read: Viral Video: కార్పొరేట్ ఉద్యోగం వదిలి ఆటో డ్రైవర్ ను అయ్యా.. జీవితంలో చాలా పాఠాలు నేర్చుకున్నా.. వీడియో వైరల్
‘మానసిక స్థితి సరిగాలేదు’
బాధితుడు సింహం డెన్ లోకి ప్రవేశించిన విషయం పర్యాటకుల ద్వారా తమ దృష్టికి వచ్చినట్లు జూ అధికారి ఒకరు తెలిపారు. వెంటనే రెస్క్యూ టీమ్, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని చర్యలు చేపట్టారని అన్నారు. అయితే సింహం బోనులోకి ప్రవేశించిన వ్యక్తి.. మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు స్పష్టం చేశారు. కాగా దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నందున జూని తాత్కాలికంగా మూసివేశారు.
⚡A lioness mauled a young man who entered her enclosure at a #Brazilian zoo.
This was reported by the local news portal G1.
The tragedy reportedly occurred in the city of João #Pessoa in northeastern #Brazil. The 19-year-old man climbed over a six-meter fence and descended a… pic.twitter.com/fV34cVQN3U
— News.Az (@news_az) December 1, 2025
