Lion Viral Video: అడవికి రారాజుగా సింహాన్ని చెబుతుంటారు. దాని పంజా ముందు ఎంతటి బలమైన జంతువైనా తలవంచక తప్పదు. అలాంటి క్రూరమైన సింహం జనావాసాల్లోకి వస్తే ఇక ఏమైనా ఉందా? అన్న సందేహం రాకమానదు. అయితే దక్షిణాఫ్రికాలో ఓ సింహం.. జనవాసాల్లోకి రావడమే కాకుండా ఏకంగా ఓ సూపర్ మార్కెట్ లోకి ప్రవేశించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అందులో సూపర్ మార్కెట్ లో విక్రయానికి పెట్టిన మాంసాన్ని ఎంచక్కా తింటూ కనిపించింది. ఇది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే ఇది ఏఐ ద్వారా రూపొందించిన వీడియో అని ప్రచారం జరుగుతోంది. అందులో నిజానిజాలేంటో ఇప్పుడు చూద్దాం.
సింహాం సూపర్ మార్ట్ లోకి ఎంటరైన విజువల్స్ ను గమనిస్తే.. ఎక్కడో క్లారిటీ మిస్ అయినట్లు స్పష్టంగా అనిపిస్తోంది. సీసీటీవీ కెమెరాలో సింహాన్ని క్యాప్చర్ చేసినట్లు వీడియోను బట్టి తెలుస్తోంది. అయితే సింహాన్ని బట్టి కెమెరా యాంగిల్స్ మారుతుండటం, వీడియో.. జూమ్ ఇన్ – జూమ్ ఔట్ కావడాన్ని చూడవచ్చు. అది సాధారణ సీసీటీవీ కెమెరాల్లో అసంభవమని చెప్పవచ్చు. అంతేకాదు వీడియో ప్రారంభంలో ఒక వ్యక్తి సింహాన్ని చూసి పారిపోయాడు. మరోవ్యక్తి దాన్ని బయటకు పంపే క్రమంలో సింహానికి సమీపంగా ప్రయత్నించాడు. సాధారణంగా ఏ వ్యక్తి ఒక సింహానికి అంత క్లోజ్ వెళ్లే ప్రయత్నం చేశారు. ఒకవేళ చేసినా.. మనిషి దగ్గరగా వచ్చినప్పుడు సింహం కచ్చితంగా దాడి చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.
Wild Lion Storms Into South African Grocery Store! 🦁🥹 pic.twitter.com/VpDt0WLF8F
— Nature & Animals🌴 (@naturelife_ok) June 16, 2025
Also Read: Air india Plane Crash: మాకు ఆ సీటే కావాలి.. డబ్బు ఎంతైనా చెల్లిస్తాం.. విమాన ప్రయాణికులు!
వీడియో ప్రారంభంలో సింహం తోకను గమనిస్తే.. అది కచ్చితంగా ఒరిజినల్ కాదన్న విషయం బయటపడుతుందని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. తోక ఉన్న విధానం.. ఒకసారిగా మారిపోయిందని.. ఇది వాస్తవంలో అసాధ్యమని అంటున్నారు. మాంసాన్ని సింహం తింటున్న క్రమంలో వాటంతటం అవే ముక్కలుగా మారిపోవడాన్ని చూస్తే అది కచ్చితంగా ఏఐ వీడియోనని ఈజీగా అర్థమవుతుందని చెప్పారు. ఏది ఏమైనా ఈ సింహం వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ కావడమే కాకుండా.. పెద్ద చర్చకు దారి తీయడం ఆసక్తికరంగా మారింది.
Also Read This: Lion Viral Video: ఇదేం సింహంరా బాబూ.. మాంసం కోసం షాపింగే చేసింది.. వీడియో వైరల్!