Man Marries 2 Women: ఈ జనరేషన్ మగవారికి పెళ్లి అనేది ఓ అగ్నిపరీక్షగా మారింది. ఆడపిల్లలు దొరక్క చాలా మంది 30 ఏళ్లు దాటినా ఇంకా బ్రహ్మచర్యంలోనే ఉండిపోతున్నారు. మ్యాట్రిమోనీ సైట్స్, పెళ్లిళ్ల పేరయ్యల సాయంతో కాబోయే శ్రీమతి కోసం తెగ వెతికేస్తున్నారు. అయితే ఇక్కడ ఒకరికే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఓ యువకుడు ఏకంగా ఇద్దరిని పెళ్లాడి (Man Marries 2 Women) వార్తల్లో నిలిచాడు. అది కూడా ఒకే పెళ్లి మండపంపై ఇద్దరు స్త్రీలకు తాళి కట్టి వైరల్ గా మారాడు.
వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన సూర్యదేవ్ (Suryadev) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి 3 ఏళ్ల క్రితం లాల్ దేవి (Lal Devi), జల్కర్ దేవి (Jalkar Devi) అనే ఇద్దరు అమ్మాయిలతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే ఆ ఇద్దరు యువతులకు ఒకరంటే ఒకరికి పరిచయం లేదు. కనీసం ఒకే ఊరికి సైతం చెందినవారు కాదు. అయినప్పటికీ వారి ఆలోచనలు సూర్యదేవ్ తో ముడిపడ్డాయి. అతడితో జీవితాన్ని పంచుకోవాలని భావించారు.
కుటుంబ సభ్యులు షాక్
ముగ్గురు మనసులు కలవడంతో సూర్యదేవ్ ను పెళ్లి చేసుకోవాలని ఇద్దరు దేవీలు నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు ముగ్గురూ చెప్పగా వారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. తొలుత వీరి పెళ్లికి అంగీకరించలేదు. అయితే ముగ్గురు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ కావడంతో తల్లిదండ్రులు సైతం పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు.
Also Read: Kiran Royal warns YCP: ఇదేం వార్నింగ్.. ఏకంగా బట్టలూడదీసి కొడతారట!
పెళ్లికార్డులో ఇద్దరి పేర్లు
సూర్యదేవ్, లాల్ దేవి, జల్కర్ దేవి పెళ్లికి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లి ఏర్పాట్లు చకచకా మెుదలయ్యాయి. ఈ క్రమంలో ఆహ్వాన పత్రికను ముద్రించగా అందులో సత్యదేవ్.. ఇద్దరి యువతుల పేర్లను చేర్చారు. దీంతో అప్పటివరకూ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసిన ఈ ముగ్గురి పెళ్లి వ్యవహారం జిల్లా మెుత్తం పాకింది. వారి వెడ్డింగ్ కార్డు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also Read This: Hight Court – Vishnupriya: విష్ణుప్రియ అరెస్ట్ ఖాయమేనా? క్వాష్ పిటిషన్ కొట్టివేత
పెళ్లివీడియో వైరల్
ఈ క్రమంలోనే తాజాగా సూర్యదేవ్ పెళ్లి జరిగింది. ఒకే మండపంలో ఇద్దరు యువతులను అతడు పెళ్లాడుతున్న దృశ్యాలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక్కడ ఒకరు దొరక్క అల్లాడుతుంటే నీకు ఇద్దరా? అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ‘నువ్వు పెట్టి పుట్టావ్ బ్రో’ అంటూ సూర్యదేవ్ ను ప్రశంసిస్తున్నారు. అందులోనూ ఇద్దరినీ ప్రేమ పెళ్లి చేసుకోవడం హైలెట్ ఆకాశానికెత్తుతున్నారు.