Shocking Incident: రైల్లో సీటు ఇవ్వలేదని పెప్పర్ స్ప్రే కొట్టిన మహిళ
Shocking Incident (Image Source: Twitter)
Viral News

Shocking Incident: రైలులో సీటు ఇవ్వలేదని.. పెప్పర్ స్ప్రే కొట్టిన మహిళ.. వీడియో వైరల్

Shocking Incident: రైళ్లల్లో సీటు దొరకకపోవడమనేది సర్వ సాధారణ విషయం. దేశంలో అత్యధిక మంది ప్రయాణించే రవాణా వ్యవస్థ రైళ్లే కావడంతో నిత్యం రద్దీ ఉంటుంది. ముఖ్యంగా జనరల్ బోగీల్లో పరిస్థితి మరింత దారుణం. కనీసం నిలబడటానికి సైతం చోటు ఉండదు. అలాంటి రైలులో సీటు దొరకలేదని ఓ మహిళ ఊహించని పని చేసింది. తనకు సీటు ఇవ్వని కారణంగా తోటి మహిళలపై పెప్పర్ స్ప్రే కొట్టింది. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

అసలేం జరిగిందంటే?

ప్రస్తుతం వైరల్ అవుతున్న పెప్పర్ స్ప్రే ఘటన.. బెంగాల్ లోని సీల్దా (Sealdah railway station) రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్ స్టాగ్రామ్ యూజర్ అమృత సర్కార్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పంచుకున్నారు. ఓ వీడియోను సైతం షేర్ చేస్తూ ‘ప్రమాదరకమైన అనుభవం’గా క్యాప్షన్ పెట్టారు. అమృత షేర్ చేసిన వీడియోను గమనిస్తే ఆకుపచ్చ కుర్తీ ధరించిన యువతితో తోటి ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. సీటు దొరకకపోవడంతో సదరు మహిళ తన బ్యాగ్‌లో నుంచి పెప్పర్ స్ప్రే తీసి మరో మహిళ ముఖంపై కొట్టినట్లు అమృత తన పోస్ట్ లో తెలిపారు.

రైల్వే పోలీసులకు అప్పగింత

అయితే తోటి ప్రయాణికురాలిపై పెప్పర్ స్ప్రే కొడుతున్న క్రమంలో ఆమె పక్కన ఉన్న మరో మహిళ అడ్డుకున్నట్లు అమృత పేర్కొన్నారు. ఈ క్రమంలో స్ప్రే మరింత గాల్లోకి వెదజల్లబడినట్లు చెప్పారు. దీంతో ఇతర ప్రయాణికుల ముక్కు, కళ్లు మండిపోయాయని అన్నారు. కొందరైతే విపరీతంగా తగ్గుతూ ఇబ్బంది పడ్డారని చెప్పారు. చిన్న పిల్లలు సైతం తీవ్ర అస్వస్థతకు గురైనట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన ఆ మహిళను తోటి ప్రయాణికులు బంధించి.. రైల్వే పోలీసులకు అప్పగించినట్లు ఆమె వివరించారు.

Also Read: Hyderabad: మరో 2 చెరువులకు మహర్దశ.. పర్యాటకంగా అభివృద్ధి.. హైడ్రా చీఫ్ కీలక ఆదేశాలు

‘కనీసం పశ్చాత్తాపం లేదు’

పెప్పర్ స్ప్రే మహిళల రక్షణ కోసం ఉద్దేశించిందని.. ఇలా సీటు కోసం తోటి ప్రయాణికులపై ప్రయోగించడం ఏంటని అమృత తన పోస్ట్ లో ప్రశ్నించారు. సదరు మహిళ తన హద్దు మీరి ప్రవర్తించిందని మండిపడ్డారు. ఆమె చాలా క్రిమినల్ మైండ్ ను కలిగి ఉందని.. తప్పు చేసినందుకు ఏ మాత్రం పశ్చాత్తాపం పడలేదని చెప్పుకొచ్చారు. మరోవైపు నెటిజన్లు సైతం ఈ ఘటన గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ‘మరి సీటు కోసం ఇంతకు తెగించాలా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.

Also Read: FUNKY Movie Teaser: ‘ఫంకీ’ టీజర్ రిలీజ్.. విశ్వక్ నోట అనుదీప్ మార్క్ పంచ్‌లు.. హిట్ కొట్టేలాగే ఉన్నారుగా!

Just In

01

Ramchander Rao: పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై కాంగ్రెస్‌కు ప్రేమ ఎందుకు? రాంచందర్ రావు తీవ్ర విమర్శ!

Viral Video: రూ.70 లక్షల బాణాసంచా.. గ్రాండ్ డెకరేషన్.. ఎమ్మెల్యే కొడుకు పెళ్లి వైరల్!

Aadi Srinivas Slams KTR: కేవలం 175 ఓట్ల తేడాతో 2009లో గెలిచావ్.. కేటీఆర్ కామెంట్స్‌కు ఆది స్ట్రాంగ్ కౌంటర్!

Fake Death Scam: హోమ్ లోన్ తీర్చేందుకు నకిలీ మరణం.. ప్రేయసి చాట్స్‌తో బయటపడ్డ మోసం

Hydra: ప్రజావాణికి 46 ఫిర్యాదులు.. కబ్జాలపైనే ఎక్కువగా ఆర్జీలు!