FUNKY Movie Teaser: విశ్వక్ నోట అనుదీప్ మార్క్ పంచ్‌లు!
FUNKY Movie Teaser (Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

FUNKY Movie Teaser: ‘ఫంకీ’ టీజర్ రిలీజ్.. విశ్వక్ నోట అనుదీప్ మార్క్ పంచ్‌లు.. హిట్ కొట్టేలాగే ఉన్నారుగా!

FUNKY Movie Teaser: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఫంకీ’. ‘జాతిరత్నాలు’ (Jathi Ratnalu) ఫేమ్ అనుదీప్ (K.V. Anudeep) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తమిళ నటి కయాదు లోహర్ హీరోయిన్ గా చేస్తోంది. భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) సంగీతం సమకూరుస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ విడుదల కాగా.. అది విశేషంగా ఆకట్టుకుంటోంది.

పంచ్‌లే పంచ్‌లు..

నిర్మాణ సంస్థ సితారా ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) ఫంకీ టీజర్ ను విడుదల చేసింది. ఒక నిమిషం 47 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్.. ఆద్యంతం ఏంతో ఎంటర్ టైనింగ్ గా ఉంది. విష్వక్ సేన్ కామెడీ టైమింగ్ కు.. అనుదీప్ స్టైల్ పంచ్ లు తోడవడంతో టీజర్ నెక్స్ట్ లెవల్లో అలరిస్తోంది. విశ్వక్ సేన్ తన గత చిత్రాలకు భిన్నంగా టీజర్ లో కనిపించాడు. అనుదీప్ మార్క్ డైలాగ్స్ చెబుతూ కడుపుబ్బా నవ్వించాడు. టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ చూసి.. ఈ సినిమా పక్కాగా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

విజయం.. చాలా అవసరం

నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen).. ఫంకీ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అటు దర్శకుడు అనుదీప్ పరిస్థితి సైతం అలాగే ఉంది. విశ్వక్ విషయానికి వస్తే అతడు నటించిన గత రెండు చిత్రాలు ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky), ‘లైలా’ (Laila) చిత్రాలు ప్రేక్షకులను అలరించలేదు. అంతకుముందు వచ్చిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) సైతం ఆర్థికంగా విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ‘ఫంకీ’ విజయం విశ్వక్ సేన్ కు తప్పనిసరిగా మారిపోయింది.

Also Read: Bigg Boss Telugu Promo: బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్.. కనుక్కోండి చూద్దాం.. ప్రోమో మామూల్గా లేదుగా!

ఫంకీపై.. అనుదీప్ ఆశలు

యంగ్ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ‘జాతి రత్నాలు’ చిత్రం ఏ స్థాయిలో అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తర్వాత తమిళ నటుడు శివ కార్తికేయన్ (Siva Karthikeyan)తో చేసిన ‘ప్రిన్స్’ (Prince) చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. దీంతో ‘ఫంకీ’ చిత్రంతో తిరిగి కమ్ బ్యాక్ ఇవ్వాలని అనుదీప్ భావిస్తున్నాడు. ఇందులో భాగంగా ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం