Bigg Boss Telugu Promo: బిగ్ బాస్ తెలుగు 9 సీజన్.. అందరి అంచనాలను అందుకుంటూ ముందుకు సాగుతోంది. సరికొత్త టాస్కులతో ఇంటి సభ్యులను బిగ్ బాస్ పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతీ వీక్ లాగానే ఈ వీక్ కూడా కొత్త కెప్టెన్ ను ఎంచుకునే టాస్క్ ను బిగ్ బాస్ నిర్వహించాడు. శుక్రవారం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ కు సంబంధించిన సెకండ్ ప్రోమోను తాజాగా విడుదల చేసారు. ప్రస్తుతం ఈ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది.
‘కనుక్కోండి చూద్దాం’
సెకండ్ ప్రోమోను గమనిస్తే అందులో.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 5వ కెప్టెన్ అవ్వడానికి ఒక టాస్క్ పెట్టారు. ‘కనుక్కోండి చూద్దాం’ పేరుతో నిర్వహించిన ఈ టాస్క్ లో ముందుగా కెప్టెన్సీ రేసులో నిలిచిన రాము, దివ్య, పవన్ కళ్యాణ్, భరణి, ఇమ్మాన్యుయెల్, తనూజ కళ్లకు గంతలు కట్టించారు. ఈ టాస్క్ కు సంజనాను సంచాలకులుగా ఎంపిక చేశారు.
గేమ్ రూల్స్..
టాస్క్ కు సంబంధించిన రూల్స్ ను సైతం ప్రోమోలో స్పష్టంగా బిగ్ బాస్ చెప్పారు. ముందుగా గార్డెన్ ఏరియాలో పోటీదారులకు చైర్లు ఏర్పాటు చేసి.. వాటి పైన లైట్స్ ఏర్పాటు చేశారు. ఆపై ఆ బల్బులకు సంబంధించిన స్విచ్చులను సైతం పక్కన టేబుల్ పై ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ మాట్లాడుతూ ‘సంచాలకురాలు.. కెప్టెన్సీ రేసులో నిలిచిన ఇంటి సభ్యుల్లో ఒకరిని ఎంచుకొని వారి భుజంపై చేయి తట్టాలి. అప్పుడు ఆ ఇంటి సభ్యుడు మిగిలిన సభ్యుల్లో ఒకరిని ఎంచుకొని వారి తలపైన ఉన్న లైట్ ను ఆఫ్ చేయాలి. తిరిగి తమ చైర్ లో కళ్లకు గంతలు కట్టుకొని కూర్చోవాలి. లైట్ ఆరిపోయిన ఇంటి సభ్యుడు ఆ స్విచ్ ఎవరు ఆపివేశారో గెస్ చేయాలి. వారు గెస్ చేసిన ఇంటి సభ్యుడు, లైట్ ఆఫ్ చేసిన వారు ఒకరే అయితే ఆ లైట్ ఆఫ్ చేసిన సభ్యుడు ఎలిమినేట్ అవుతారు’ అని బిగ్ బాస్ చెబుతాడు.
Also Read: Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి ప్రకటన.. ట్రంప్‌కు మాత్రం కాదు.. మరి ఎవరికంటే?
భరణి, రాము ఔట్..
టాస్క్ లో భాగంగా సంచాలకురాలు సంజన.. ముందుగా రాము వద్దకు వెళ్లి అతడి భుజంపై చేయి వేస్తుంది. అప్పుడు రాము.. దివ్యకు సంబంధించిన లైట్ ను ఆఫ్ చేస్తాడు. అయితే దివ్య.. రామును కరెక్ట్ గా గెస్ చేయడంతో అతడు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడు. ఆ తర్వాత భరణి.. పవన్ కళ్యాణ్ లైట్ ఆఫ్ చేయగా.. అతడు కూడా సరిగ్గా గెస్ చేస్తాడు. ఫలితంగా భరణి కూడా టాస్క్ నుంచి ఔటై పక్కనే ఉన్న సోఫాలోకి వెళ్లి కూర్చుంటాడు. ఆ తర్వాత తనూజ లేచి.. దివ్య లైట్ ను ఆఫ్ చేసినట్లుగా చూపించారు. అయితే దివ్య తనూజాకు బదులు పవన్ కళ్యాణ్ పేరు చెప్పడంతో ప్రోమో ముగిసింది. టాస్క్ లో చివరి వరకూ నిలిచి కెప్టెన్ అయినది ఎవరో తెలియాలంటే.. నేటి ఫుల్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. అయితే బిగ్ బాస్ ఇంటి ఐదో కెప్టెన్ గా పవన్ కళ్యాణ్ ఎంపికైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
