Twitter killer
Viral, లేటెస్ట్ న్యూస్

Takahiro Shiraishi: గడగడా వణించిన సీరియల్ కిల్లర్‌కు ఉరిశిక్ష అమలు

Takahiro Shiraishi: ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 9 వరుస హత్యలు చేసిన ‘ట్విటర్ కిల్లర్’ తకహిరో షిరైషికి (Takahiro Shiraishi) జపాన్ శుక్రవారం ఉరిశిక్ష అమలు చేసింది. 2017లో 13 నుంచి 23 ఏళ్ల వయసున్న 9 మందిని షిరైషి అతిక్రూరంగా హత్య చేశాడు. ఆత్మహత్య చేసుకోవాలని భావించిన బాధితులతో ట్వీటర్‌లో మాటలు కలిపి, చనిపోవడానికి సహాయం చేస్తానంటూ దగ్గర చేసుకున్నాడు. తన ఫ్లాట్‌కు రప్పించి గొంతు కోసి, అవయవాలను ముక్కలుముక్కలుగా నరికాడు. షిరైషి ఇంట్లోని కూలర్‌లో బాధితుల శరీర భాగాల ముక్కలను భద్రపరిచినట్టు పోలీసు అధికారులు గుర్తించారు. వరుసగా తొమ్మిది హత్యలు చేసినట్టుగా షిరైషి విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో, డిసెంబర్ 2020లో కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. ఆ ఉరి శిక్షను శుక్రవారం (జూన్ 27) అమలు చేశారు. దీంతో, జపాన్ సీరియల్ కిల్లర్ కథ ముగిసింది.

Read this- Mohammed Siraj: సిరాజ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన దిగ్గజ మాజీ క్రికెటర్

దాదాపు మూడు సంవత్సరాల తర్వాత తొలిసారి జపాన్‌లో ఓ వ్యక్తికి మరణశిక్ష పడింది. షిరైషి 2017లో టోక్యో నగరానికి సమీపంలోని జామాలోని తన అపార్ట్‌మెంట్‌లో 8 మంది అమ్మాయిలను, ఒక పురుషుడిని హత్య చేశాడు. ఎక్స్ (గతంలో ట్విటర్) ద్వారా బాధితులను సంప్రదించడంతో ‘ట్విట్టర్ కిల్లర్’గా వ్యవహరించారు. తన అపార్ట్‌మెంట్ చుట్టూ ఉన్న కూలర్లలో తొమ్మిది మంది బాధితుల మృతదేహాల ముక్కలను దాచిపెట్టినట్టు దర్యాప్తులో తేలింది. షిరైషికి ఉరిశిక్ష విధించేందుకు జపాన్ న్యాయ మంత్రి కీసుకే సుజు అనుమతి ఇచ్చారు. కేసును జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు చెప్పారు.

Read this-Viral News: కోడలి హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. అర్ధరాత్రి గదిలోకి మామ

2022 జులై తర్వాత జపాన్‌లో ఒక వ్యక్తికి మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి. గతేడాది అక్టోబర్‌లో ప్రధాని షిగెరు ఇషిబా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరణశిక్ష అమలు చేయడం కూడా ఇదే తొలిసారి. కాగా, జపాన్‌లో మరణశిక్షలను ఉరితీయడం ద్వారా అమలు చేస్తారు. ఉరిశిక్ష అమలు చేయడానికి ముందే దోషులకు తెలియజేస్తారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు