Mohammad Siraj
Viral, లేటెస్ట్ న్యూస్

Mohammed Siraj: సిరాజ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన దిగ్గజ మాజీ క్రికెటర్

Mohammed Siraj: లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలవ్వడంపై భారత దిగ్గజ మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ (Mohammed kaif) స్పందించాడు. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj:) బౌలింగ్ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. మహమ్మద్ సిరాజ్ చాలా కష్టంగా బౌలింగ్ చేశాడని కైఫ్ మండిపడ్డారు. ‘‘సర్, మొక్కుబడిగా బౌలింగ్ చేయకండి. మనస్సు పెట్టి బౌలింగ్ చేయండి. లైన్ అండ్ లెంగ్త్‌ బంతులు వేస్తేనే మనం వికెట్లు సాధించగలం’’ అంటూ సిరాజ్‌పై కైఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడాడు. ‘‘సెకండ్ ఇన్నింగ్స్‌లో బుమ్రా ఎందుకు వికెట్లు తీయలేదు?. ఎందుకంటే, అతడి బౌలింగ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు ఆచితూచి జాగ్రత్తగా ఆడారు. అయితే, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌ బౌలింగ్‌లో ఎదురుదాడికి దిగారు. బుమ్రా 4-5 ఓవర్లు బౌలింగ్ చేస్తాడని తెలిసినప్పుడు ప్రత్యర్థి జట్టు గేమ్ ప్లాన్ చాలా సులభం అవుతుంది. ఇదే బౌలింగ్‌ లైనప్‌తో మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, బుమ్రాలను కెప్టెన్ గిల్‌కు ఇస్తే టెస్ట్ సిరీస్‌ను కచ్చితంగా గెలుస్తారని నేను హామీ ఇవ్వగలను. 20 వికెట్లు ఎలా పడగొట్టాలో తెలిసిన బౌలర్లు వీళ్లే’’ అ ని మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు.

Read this- Rath Yatra 2025: కిక్కిరిసిన పూరీ.. వైభవోపేతంగా రథయాత్ర

తొలి టెస్టులో ఘోరంగా విఫలం
లీడ్స్‌లోని హెడింగ్లీ పిచ్ బౌలర్లకు పెద్దగా సహకరించేదు. దీంతో, భారత బౌలర్లు తేలిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీశాడు. ప్రసిద్ధ్ కృష్ణ 3, మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు. అయితే, పరుగులు మాత్రం దారుణంగా సమర్పించుకున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ 6.40, సిరాజ్ 4.50 ఎకానమీ రేట్లతో పరుగులు ఇచ్చారు. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో అయితే మరింత చెత్తగా బౌలింగ్ చేశారు. 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ ఏకంగా 188 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో, ఆతిథ్య ఇంగ్లాండ్ మరో ఐదు వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు. అయితే, స్టార్ పేసర్లు బుమ్రా 19 ఓవర్లు, సిరాజ్ 14 ఓవర్లు బౌలింగ్ చేశారు. కానీ, కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో మొత్తం 41 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

Read this- Viral News: కోడలి హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. అర్ధరాత్రి గదిలోకి మామ

మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
2వ టెస్ట్: జులై 2-6 మధ్య బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతుంది.
3వ టెస్ట్: జులై 10-14 మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతుంది.
4వ టెస్ట్: జులై 23-27 మధ్య మాంచెస్టర్ వేదికగా జరుగుతుంది.
5వ టెస్ట్: జులై 31- 4 ఆగస్టు మధ్య లండన్‌లో ఓవల్‌గా వేదికగా జరుగుతుంది.

Just In

01

Miryalaguda: మిర్యాలగూడ అభివృద్ధిపై ఫోకస్.. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay: యువత రాజకీయాల్లోకి రావాలి… కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపు

VC Sajjanar: కరేబియన్ పౌరసత్వo.. 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా.. 21వేల సినిమాలు.. ఐబొమ్మ రవి చిట్టా ఇదే!

Chain Snatching: ఎంతకు తెగించార్రా.. ఉదయాన్నే బరితెగించిన చైన్ స్నాచర్స్

Jagtial: జగిత్యాల జిల్లాలో దారుణం.. 7 ఏళ్ల బాలికపై అఘాయిత్యం