Viral News
Viral, లేటెస్ట్ న్యూస్

Viral Video: స్నేహితుడి చివరికోరిక తీర్చిన వ్యక్తి.. వైరల్ వీడియో ఇదిగో

Viral Video: అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం (ఆగస్టు 3) నాడు మధ్యప్రదేశ్‌లోని మండసౌర్ జిల్లాలో హృదయాన్ని హత్తుకునే ఘటన ఒకటి (Viral Video) వెలుగుచూసింది. జిల్లాలోని జవాసియా గ్రామానికి చెందిన అంబాలాల్ ప్రజాపతీ అనే వ్యక్తి తన స్నేహితుడి అంత్యక్రియల్లో కన్నీళ్లతో డ్యాన్స్ చేశాడు. తనకు అత్యంత సన్నిహితుడైన తన స్నేహితుడి చివరి కోరిక ఇదేనని, అతడి అంత్యక్రియల్లో డ్యాన్స్ చేయాలంటూ రాసుకున్నాడని, దానిని నెరవేర్చానంటూ ప్రజాపతి భావోద్వేగంతో చెప్పాడు.

71 ఏళ్ల వయసున్న సోహన్‌లాల్ జైన్ అనే వృద్ధ వ్యక్తి మృతి చెందాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని డ్యాన్స్ వేసిన ఆ స్నేహితుడి పేరు 51 ఏళ్ల అంబాలాల్ ప్రజాపతి. అంతిమయాత్రలో ప్రజాపతి నృత్యం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చనిపోయిన తన స్నేహితుడు రాసిన ఓ లేఖను ప్రజాపతి అందరికీ చూపించి భావోద్వేగానికి గురయ్యాడు. పొంగి వస్తున్న దు:ఖంతో, కన్నీళ్లు పెట్టుకొని ప్రజాపతీ డ్యాన్స్ వేయగా, స్థానికులు, చుట్టుపక్కల వారు చూశారు. ఏడ్చుకుంటూ ప్రజాపతి డ్యాన్స్ చేయడం అక్కడున్నవారిని కదిలించింది. ‘‘ఆయన చనిపోయినప్పుడు అంతిమయాత్రలో డ్యాన్స్ చేయాలని నా స్నేహితుడు నన్ను కోరాడు. ఆ వాగ్దానాన్ని నేను నెరవేర్చాను. ఆయన నాకు స్నేహితుడికన్నా ఎక్కువ. నా నీడలాంటివాడు’’ అని అంబాలాల్ ప్రజాపతి మీడియాతో అన్నాడు.

Read Also- Army officer: ఎయిర్‌పోర్టులో స్పైస్‌జెట్ సిబ్బందిని చితక్కొట్టిన ఆర్మీ ఆఫీసర్.. కారణం ఇదే

ఇలాంటి స్నేహబంధం చాలా అరుదని, తన శవయాత్రలో నృత్యం చేయాలంటూ సోహన్‌లాల్ కోరడంతో ప్రజాపతి నెరవేర్చారని ఈ అంత్యక్రియలను చూసిన పండిత్ రాకేశ్ శర్మ అన్నారు. ప్రజాపతి మనసారా స్నేహితుడి కోరికను నెరవేర్చారని, ఇలాంటి స్నేహ బంధాలు ఎప్పటికీ నిలిచిపోతాయని వ్యాఖ్యానించారు.

ఇంతకీ సోహన్‌లాల్ లేఖలో ఏం చేశారు?
మరణానికి ముందు సోహన్‌లాల్ ఒక లేఖ రాశారు. ‘‘అంబాలాల్ ప్రజాపతి, శంకర్‌లాల్ ఇద్దరూ కలిసి నా శవం ముందు డ్యాన్స్ చేయాలి. నేను తెలిసీ తెలియక ఎవరినైనా నొప్పించి అంటే దయచేసి క్షమించండి’’ అంటూ అందులో పేర్కొన్నారు. స్నేహితుడు శవం ముందు డ్యాన్స్ చేయడంపై అంబాలాల్ ప్రజాపతి భావోద్వేగంగా స్పందించారు. ‘‘సోహన్‌లాల్‌కి రెండేళ్ల క్రితం క్యాన్సర్ నిర్ధారణ అయింది. తొలుత రత్లం, తర్వాత మండసౌర్‌, చివరికి అహ్మదాబాద్‌లో చికిత్స తీసుకున్నాడు. చివరాఖరకు ఆయన జీవిత పోరాటంలో ఓడిపోయాడు’’ అని తెలిపాడు.

Read Also- Siraj: బుమ్రా లేనప్పుడు బాగా రాణిస్తావెందుకు?.. సిరాజ్ సమాధానం ఇదే

కాగా, ఉద్వేగభరితమైన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌‌లో ఇప్పటికే వేలాది మంది వీక్షించారు. ఈ వీడియోపై ఒక నెటిజన్ స్పందిస్తూ, నిజమైన స్నేహ బంధానికి ఇదొక ఉదాహరణ అని కామెంట్ చేశారు. అంతిమ యాత్రలో స్నేహితుడు డ్యాన్స్ చేసి, సోహన్‌లాల్ చివరి కోరికను నెరవేర్చాడు!. చక్కటి స్నేహమని పేర్కొన్నాడు. మరో నెటిజన్ స్పందిస్తూ, జవాసియా గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన హృదయాలను హత్తుకునేలా ఉందన్నారు. నిజమైన స్నేహం మరణం తర్వాత కూడా బతికే ఉంటుందనేందుకు ఒక ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు