Heart Attack ( Image Source: Twitter)
Viral

Heart Attack : హర్ట్ ఎటాక్ వచ్చే ముందు మన శరీరం ఈ 7 సిగ్నల్స్ ఇస్తుందని తెలుసా?

Heart Attack Signs: ఇటీవలే కాలంలో హార్ట్ ఎటాక్ (గుండెపోటు) తో ఎంతో మంది మరణిస్తున్నారు. ఇది ప్రాణాంతకమైన సమస్య, గుండెకు రక్త సరఫరా అడ్డుకోవడం వల్ల ఇది వస్తుంది. అయితే, ఇది ఒక్కసారిగా రాదు, శరీరం ముందుగానే కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. ఈ లక్షణాలను గుర్తించి, వైద్య సహాయం తీసుకోవడం వల్ల ప్రాణాలను కాపడుకోవచ్చు. హార్ట్ ఎటాక్ వచ్చే ముందు శరీరం 7 ముఖ్యమైన సంకేతాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ఛాతీలో నొప్పి లేదా ఒత్తిడి

హార్ట్ ఎటాక్‌కు ముందు ఛాతీలో నొప్పి వస్తుంది. ఛాతీ బరువుగా అనిపించవచ్చు. ఈ నొప్పి ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపు సంభవించవచ్చు. కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంటుంది.

Also Read: Kolli Veera Prakash Rao: అక్క బాటలోనే తమ్ముడు.. కళ్లు చిరంజీవి ఐ బ్యాంక్‌కి.. భౌతిక కాయం అపోలో ఆసుపత్రికి!

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

హార్ట్ ఎటాక్ ( Heart Attack )ముందు శ్వాస ఆడకపోవడం, శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించవచ్చు. ఈ లక్షణం తరచుగా ఛాతీ నొప్పితో కలిసి కనిపిస్తుంది. ఈ సమస్య ఇలా కొనసాగితే, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

భుజాలు, చేతులు నొప్పి

గుండెపోటు సంకేతంగా భుజాలు, చేతులు, దవడ భాగంలో ఈ నొప్పి తీవ్రంగా ఉంటుంది. కానీ, దీనిని నిర్లక్ష్యం చేయకూడదు.

Also Read: Star Actress: ఆ నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్

అలసట
అతిగా అలసట లేదా శక్తి లేనట్టు అనిపించడం కూడా హార్ట్ ఎటాక్ సూచన కావచ్చు. ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. రోజువారీ పనులు చేయడం కష్టంగా అనిపిస్తే, దీనిని అశ్రద్ద చేయకండి.

వికారం లేదా వాంతులు

కొందరిలో హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కడుపులో అసౌకర్యంగా కనిపిస్తుంది. ఈ లక్షణం తరచుగా గ్యాస్ లేదా అజీర్ణంతో గందరగోళం చెందవచ్చు. కానీ ఇది కూడా గుండె సమస్యకు సంకేతం కావచ్చు.

Also Read: Swecha Suicide: యాంకర్ స్వేచ్ఛ సూసైడ్.. తెరపైకి షాకింగ్ నిజాలు.. బాంబ్ పేల్చిన తండ్రి!

చెమటలు పట్టడం

హార్ట్ ఎటాక్ వచ్చే 7 రోజుల ముందు చెమటలు పట్టడంవంటివి జరగవచ్చు. ఈ చెమటలు గుండె సమస్యకు సంకేతం కావచ్చు.

తలతిరగడం

గుండెకు రక్త సరఫరా సరిగా జరగనప్పుడు, మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీని వలన మైకం లేదా తలతిరగడం తిరుగుతుంది. కొంతమంది కళ్ళు తిరిగి కూడా పడిపోవచ్చు. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యుని వద్దకు వెళ్ళండి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!