Grapes ( Image Source: Twitter)
Viral

Grapes: ద్రాక్షతో క్యాన్సర్‌ కు చెక్ పెట్టొచ్చు!

 Grapes: ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది ఒక నీడలా మనుషుల జీవితాలను నాశనం చేస్తుంది. జంక్ ఫుడ్, అనారోగ్యకర జీవనశైలి, ఒత్తిడి.. ఇవన్నీ క్యాన్సర్‌కు ఆహ్వానం పలుకుతున్నాయి. కానీ, గుడ్ న్యూస్ ఏంటంటే.. ప్రారంభ దశలో క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్సతో నయం చేయొచ్చు. ఇది ముదిరితే మాత్రం చాలా కష్టం. అయితే, ఒక చిన్న పండు ఈ ప్రమాదాన్ని తగ్గించే సూపర్‌ పవర్‌ను కలిగి ఉంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఆ పండు మరేదో కాదు.. ద్రాక్ష. ఇది తియ్యగా, పుల్లగా నోరూరించే ఈ చిన్ని ఫ్రూట్, క్యాన్సర్‌తో పోరాడే హీరో అని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఇంగ్లండ్‌కు చెందిన క్యాన్సర్ నిపుణులు ఈ సంచలన విషయాన్ని రివీల్ చేశారు. దీని రహస్యం ఏంటో తెలుసుకుందాం..

ద్రాక్ష ఎందుకు క్యాన్సర్ ఫైటర్?

ద్రాక్షలోని మాయాజాలం రెస్వెరాట్రాల్ (Resveratrol) అనే సహజ సమ్మేళనం. ఈ పాలీఫెనాల్, ముఖ్యంగా నలుపు, ఎరుపు ద్రాక్షల తొక్కల్లో ఉంటుంది. ఈ రెస్వెరాట్రాల్ ఒక యాంటీ-క్యాన్సర్ సూపర్‌స్టార్. ఇది శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకోవడమే కాదు, అవి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించకుండా కూడా చెక్ పెడుతుంది. రెస్వెరాట్రాల్ క్యాన్సర్ ముప్పును పూర్తిగా తొలగించకపోవచ్చు, కానీ దాని ప్రమాదాన్న గట్టిగా తగ్గిస్తుంది. అంటే, ద్రాక్ష మీ డైట్‌లో ఉంటే, క్యాన్సర్‌తో ఫైట్‌లో మీరు ఒక అడుగు ముందుంటారు.

Also Read: AI smart glasses: అమెజాన్ క్రేజీ ఆవిష్కరణ.. డెలివరీ డ్రైవర్లకు ఏఐ స్మార్ట్ గ్లాసెస్.. క్షణాల్లో డోర్ వద్దకే పార్సిల్స్!

ద్రాక్షలోని సూపర్‌ పవర్స్ ఉన్నాయని తెలుసా? 

యాంటీఆక్సిడెంట్స్ గ్యాంగ్: ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్స్ బోలెడు. ఇవి శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షిస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్స్ మీ శరీరాన్ని తుప్పు పట్టకుండా కాపాడే షీల్డ్ లాంటివి.

విటమిన్ సి బూస్ట్: ద్రాక్షలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని రాకెట్‌లా పెంచుతుంది. ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి శరీరాన్ని బలంగా ఉంచుతుంది. రోజూ ఒక గుండు ద్రాక్ష తినడం అంటే, మీ ఇమ్యూనిటీకి ఫుల్ ఛార్జ్.

Also Read: Kurnool Bus Fire Accident: బెర్త్ కోసం చూస్తే పరలోకానికే.. స్లీపర్ డిజైన్లలో భారీ లోపాలు.. మంటలోస్తే తప్పించుకునే దారేది!

దీనిని ఎలా తినాలి?

రోజూ ఒక కప్పు నలుపు లేదా ఎరుపు ద్రాక్షలను స్నాక్స్ గా తీసుకోండి. తొక్కతో సహా తినడం అలవాటు చేసుకోండి. రెస్వెరాట్రాల్ అక్కడే ఉందని అసలు మర్చిపోకండి. దీనిని జ్యూస్‌గా కాకుండా మొత్తం పండు లాగా తినడం బెటర్, ఎందుకంటే ఫైబర్, పోషకాలు పూర్తిగా లభిస్తాయి. సలాడ్స్‌లో, స్మూతీస్‌లో జోడించి తీసుకోవచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Just In

01

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు

Intermediate Exams: ఈసారి ఇంటర్ పరీక్షలు యథాతథం.. వచ్చే సంవత్సరం నుంచి మార్పులు

Satish Shah passes away: ప్రముఖ వెటరన్ నటుడు సతీశ్ షా కన్నుమూత..