goli soda
Viral

viral: అంతర్జాతీయ మార్కెట్లో దుమ్ము లేపుతున్న గోలీసోడా.. డిమాండ్ మాములుగా లేదు!

viral:  అల్లు అర్జున్ నటించిన బన్నీ సినిమా గుర్తుందా? అందులో ఎమ్మెస్ నారాయణ కొడుకు .. తన పీహెచ్ డీ పూర్తయిందని ఇక గోలీ సోడా(Goli soda)లు కొట్టడం ఆపేయాలని తండ్రితో అంటాడు. అప్పుడు.. ‘‘ఏదీ ఒక్కసారి ఇందులో గోలీని కొట్టు’’ అంటూ ఇస్తే కొడుకు కొట్టలేకపోతాడు. దానికి తండ్రి.. ‘‘ఇప్పటికైనా అర్థమైందా. పీహెచ్ డీ చేయడం కంటే సోడాలో గోలీ కొట్టడం కష్టమని’’ అంటాడు. ఆ సన్నివేశాన్ని సరదాగా గుర్తుచేస్తున్నప్పటికీ.. అసలు విషయం ఏంటంటే. భారతదేశ సాంప్రదాయ డ్రింక్ అయినా గోలీ సోడాకు అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం భారీగా డిమాండ్ పెరిగిపోయింది.

జౌను.. మీరు చదివింది నిజమే. గోలీసోడాకు ఇంటర్నేషనల్ మార్కెట్లో యమా డిమాండ్ ఉంది. అమెరికా, యూకే, యూరప్ తో పాటు గల్ఫ్ దేశాల్లో దీనికి విశేష ఆదరణ లభిస్తుంది. కొత్తగా ప్రజెంట్ చేయడం, వినూత్నంగా ఆవిష్కరించడం వల్ల ఈ పానీయానికి అక్కడ ఆదరణ అంతకంత పెరుగుతోందని కేంద్రం ఓ అధికారికి ప్రకటనలో వెల్లడించింది.

Hyderabad Police: మద్యం త్రాగి, బండి నడిపి.. ఇంత మంది పట్టుబడ్డారేంటి?

మన దేశంలో ఒకప్పుడు ఇళ్లలో చేసుకునే సోడా.. ఆయా మల్టీ నేషనల్ కంపెనీలకు చెందిన కూల్ డ్రింక్స్ అందుబాటులోకి రావడంతో కాలక్రమంలో కనుమరుగైపోయింది. కానీ స్వదేశీ ఆహార, పానీయాల ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్న ప్రభుత్వం దీన్ని.. ఇన్నోవేటివ్ గా మార్కెట్ చేయడం ద్వారా ప్రపంచ వేదికపై అద్భుతాలు సృష్టిస్తోంది. అంతర్జాతీయంగా కీలక మార్కెట్లుగా భావించే యూఎస్, యూకే, యూరప్, గల్ఫ్ దేశాల్లో ఈ బ్రాండ్ దూసుపోతుంది. గ్లోబల్ మార్కెట్ లో గోలీసోడాకు దక్కుతున్న ఆదరణ దృష్ట్యా దేశానికి సంబంధించి ఇదొక మైలురాయి లాంటిదనే చెప్పాలి.

ఫెయిర్ ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్ అనేది విదేశాలకు పలు రకాల కూరగాయలు, పండ్లు, మాంసం తదితరాలను ఎగుమతి చేసే సంస్థ. ఫెయిర్ ఎక్స్‌పోర్ట్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కింద ప్రభుత్వం గోలీసోడాను.. ‘గోలీపాప్ సోడా’(Goli Pop Soda) పేరుతో గల్ఫ్ ప్రాంతంలోని అతిపెద్ద రిటైల్ చైన్లలో ఒకటైన ‘లూలూ’ హైపర్‌ మార్కెట్‌కు ఎక్స్ పోర్ట్ చేస్తుంటుంది. ఈ గోలీ సోడా ఆర్డర్స్ స్థిరంగా ఉన్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ విభాగం, వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) తెలిపింది.

గోలీపాప్ సోడాను ప్రత్యేకంగా నిలిపింది దాని వినూత్న ప్యాకేజింగ్ అనే చెప్పాలి. ప్రత్యేకమైన పాప్ ఓపెనర్‌ను కలిగి ఉండటం కూడా దీని మరో విశిష్టత. ఈ రీబ్రాండింగే అంతర్జాతీయ మార్కెట్లను ఆకర్షించింది, దీనిని ఒక ట్రేండీ ప్రొడక్ట్ గా నిలిపింది.

ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే.. ప్రపంచ మార్కెట్లో ఉత్పత్తికి ఉన్న డిమాండ్ దృష్ట్యా.. స్వదేశీ భారతీయ రుచులు కూడా అంతర్జాతీయ దిగ్గజాలతో పోటీ పడగలవని, దేశీయ ఎగుమతులకు కొత్త మార్గాలను తెరుస్తుందని గోలీసోడా విజయమే నిదర్శనమంటున్నారు నిపుణులు.

Also Read: Cab Drivers: ఏసీ ఆన్ చేస్తే.. అంతే సంగతులట.. క్యాబ్ డ్రైవర్ల మాట ఇదే!

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం