తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Cab Drivers: దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి సమ్మె బాట పట్టిన క్యాబ్ డ్రైవర్లు తాజాగా తమ తమ వాహనాల్లో ఇకపై ఎయిర్ కండీషన్ సదుపాయాన్ని నిలిపి వేయాలని నిర్ణయించారు. క్యాబ్ డ్రైవర్ల కష్టానికి తగిన ఫలితం రాకపోతుండటం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ గిగ్, ప్లాట్ ఫాం వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు.
Also read: BJP: తెలంగాణ బీజేపీకి తప్పని రథ‘సారధి’ తిప్పలు.. పగ్గాలు ఎవరికో?
ప్రజలకు రవాణా సేవలు అందిస్తున్న ఓలా, ఉబేర్ తదితర సంస్థల తరపున నిత్యం వేలాది మంది క్యాబ్ డ్రైవర్లు వేలాదిమంది ప్రయాణీకులతో రాకపోకలు సాగిస్తున్నారు. అయితే, ఎయిర్ కండీషన్ ఆన్ చేసి కారు నడిపితే కిలోమీటరుకు 16 నుంచి 18 రూపాయలు ఖర్చవుతున్నట్టు డ్రైవర్లు చెబుతున్నారు. కాగా, ఓలా, ఉబేర్ సంస్థలు తమకు 10 నుంచి 12 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నాయన్నారు. దీంతో చేసిన కష్టానికి కూడా తగిన ప్రతిఫలం లభించక కుటుంబాలను పోషించుకోవటంలో పడరాని కష్టాలు పడుతున్నామన్నారు.
Also read: Fire Accident: ప్రభుత్వ వైద్యశాలలో అగ్ని ప్రమాదం.. మందులు అగ్గిపాలు..
ఇప్పటికే సరైన ప్రతిఫలం లభించక పోతుండటంతో ఎయిర్ పోర్టుకు క్యాబ్ సేవలు నిలిపివేసినట్టు చెప్పారు. 57వేల మందికి పైగా క్యాబ్ డ్రైవర్లు ఈ నిరసనలో పాల్గొంటున్నారన్నారు. ఇకపై ఎయిర్ పోర్టును మినహాయించి ఏ ప్రాంతానికి ట్రిప్పులు కొట్టినా తమ తమ కార్లలో ఎయిర్ కండీషన్ సౌకర్యాన్ని ప్రయాణీకులకు కల్పించమన్నారు.
Also read: KTR Comments: కేసీఆర్ మంచివారే.. నేను కాదు.. కేటీఆర్
ఈ సదుపాయం కావాలనుకునే ప్రయాణీకులు దానికి తగ్గ డబ్బు చెల్లిస్తే ఏసీని ఆన్ చేస్తామని చెప్పారు. తాము పడుతున్న కష్టాలను గుర్తించి ప్రభుత్వం ఇప్పటికైనా తమకు కష్టానికి తగ్గ ఫలితం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామన్నారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/