Giorgia Meloni: ఇటలీ ప్రధానికి ఏమైంది?.. వైరల్‌గా మారిన ఫొటో
Giorgia Meloni
Viral News, లేటెస్ట్ న్యూస్

Giorgia Meloni: ఇటలీ ప్రధానికి ఏమైంది?.. వైరల్‌గా మారిన ఫొటో

Giorgia Meloni: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni) అంతర్జాతీయ సదస్సుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. పలు దేశాల పురుష అధినేతల మధ్య ఆమె ప్రత్యేకంగా కనిపిస్తుంటారు. ఇటీవల నెదర్లాండ్స్‌లో ముగిసిన 2025 నాటో సదస్సులో కూడా ప్రపంచ అగ్ర నాయకుల మధ్య ఆమె తళుక్కున మెరిశారు. అత్యంత కీలకమైన భౌగోళిక, రాజకీయ అంశాలను ఆమె ప్రస్తావించారు. ఇవన్నీ పక్కనపెడితే, ఈ సదస్సులో భాగంగా జార్జియా మెలోని హావభావాలకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఆమె మాట్లాడిన మాటలు పెద్దగా హైలెట్ కాలేదు, కానీ, మీడియాతో మాట్లాడే సందర్భంలో ఆమె ముఖ కవళికలు చర్చనీయాంశంగా మారాయి. మెలోని అసంకల్పితంగా, ఆశ్చర్యపడుతూ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై చాలామంది నెటిజన్లు హాస్యాస్పదంగా స్పందించారు. దీంతో, ఎక్స్‌లో ఈ వీడియో వైరల్ అయ్యింది.

Read this- Law Student: ‘లా విద్యార్థిని’పై అఘాయిత్యం.. మరో ఘోరం

నెటిజన్ల స్పందనలు ఇవే
ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీకి ఏమైంది?’’ అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. మరోవ్యక్తి స్పందిస్తూ, ‘జార్జియా మెలోని బాగానే ఉన్నారు కదా?’ అని అన్నారు. మూడవ వ్యక్తి స్పందిస్తూ, ‘జార్జియా మెలోని ముఖ కవళికలను ఎలా అభివర్ణిస్తారు?’ అని పేర్కొన్నాడు. కాఫీ ఎక్కువ తాగారా ఏంటీ?, లేకపోతే, ఇమ్మానుయేల్ మేక్రాన్ చెవిలో చెప్పిన ఫ్లాష్‌బ్యాక్ గుర్తుకొచ్చిందా? అంటూ పలువురు కామెంట్లు పెట్టారు. కొకైన్ తీసుకున్నారేమోనంటూ ఓ నెటిజన్ ఆరోపణ చేశాడు. జార్జియా భయపడుతున్నారేమో అని మరో వ్యక్తి అనుమానం వ్యక్తం చేశాడు.

Read this- Viral News: కోడలి హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. అర్ధరాత్రి గదిలోకి మామ

ఇటీవలే మోదీతో ఫొటో వైరల్
మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi), జార్జియా మెలోనీ (Giorgia Meloni) మధ్య చక్కటి మైత్రి ఉందన్న విషయం తెలిసిందే. పలు అంతర్జాతీయ వేదికలపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరూ కలిసివున్న పలు ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. చాలా మీమ్స్ కూడా పేలాయి. నెటిజన్లు ఈ జంటకు ‘మెలోడీ’ (#Melodi) అని పేరు కూడా పెట్టారు. కెనడా వేదికగా ఇటీవలే ముగిసిన జీ7 సదస్సు సమయంలో కూడా ‘మెలోడి’ పదం ట్రెండింగ్‌ అయ్యింది. మోదీ, మెలోని మధ్య స్నేహపూర్వక బంధాన్ని తెలియజేసే ఫొటో ఒకటి వైరల్ కావడం ఇందుకు కారణమైంది. జీ7 సదస్సులో మోదీ, మెలోని కొద్దిసేపు ముఖాముఖీ సమావేశమయ్యారు. పరస్పరం ‘షేక్ హ్యాండ్’ ఇచ్చుకొని ఒకరినొకరు పలకరించుకున్నారు. మాట్లాడుకుంది కొద్దిసేపే అయినప్పటికీ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. వీరి భేటీకి సంబంధించిన ఫొటోను ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ‘ఇటలీ, భారత్ మధ్య గొప్ప మైత్రి ఉంది’ అని ఆమె క్యాప్షన్ ఇచ్చారు. ప్రధాని మోదీ కూడా అదే ఫొటోను రీట్వీట్ చేశారు. ‘‘మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను ప్రధాని జార్జియా మెలోనీ గారు. భారత్-ఇటలీ మధ్య స్నేహ బంధం మరింత బలపడుతుంది. ఇరుదేశాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది!’’ అని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో, ఒక్కసారిగా మోదీ, మెలోని ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండియన్ నెటిజన్లు ‘మెలోడి’ (Meloni + Modi) మీమ్స్‌ను మళ్లీ ట్రెండింగ్‌గా మార్చారు.

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!